మాస్క్ తప్పనిసరిగా ధరించమంటూ చిరు క్యాంపైన్

మెగాస్టార్ చిరంజీవి కరోనా వైరస్ తొలినాళ్లలో ఎంత యాక్టివ్ గా ముందుండి అందరికీ సహాయపడ్డారో అందరికీ తెలిసిందే. కరోనా క్రైసిస్ చారిటీని నెలకొల్పి సినీ కార్మికులకు తన వంతు సహాయం అందించడమే కాకుండా అందరినీ సహాయం చేయమని పిలుపునిచ్చాడు. అలాగే ఎప్పటికప్పుడు తన వంతుగా సోషల్ మీడియాలో ఈ కష్ట సమయంలో ఎలా నడుచుకోవాలో చెప్పిన చిరంజీవి ఇప్పుడు రీసెంట్ గా రెండు వీడియోలతో మాస్క్ ధరించడం యొక్క ప్రాముఖ్యతను తెలియజేసాడు. ఈ వీడియోల కోసం కార్తికేయ, ఈషా రెబ్బలను చిరంజీవి.

ముందుగా కార్తికేయ వీడియోలో మీసం మెలితిప్పుతూ కార్తికేయ ఉండగా చిరంజీవి వచ్చి మీసం మెలేయడం వీరత్వం కానీ అది ఒకప్పుడు, ఇప్పుడు మాస్క్ ధరించడం వీరుడి లక్షణం అంటూ మెసేజ్ ఇచ్చాడు. ఇక ఈషా రెబ్బ వీడియోలో ఈషా పెదాలకు లిప్ స్టిక్ పెట్టుకుంటుంటే చిరునవ్వు ముఖానికి అందం, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ చిరునవ్వు కలకాలం నిలవాలంటే కచ్చితంగా ముఖానికి మాస్క్ ధరించాలి అని మెసేజ్ ఇచ్చారు.

సినిమాల విషయానికొస్తే చిరంజీవి ఆచార్య సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకుడు కాగా మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. మణిశర్మ సంగీత దర్శకుడు. కాజల్ అగర్వాల్ హీరోయిన్. ఈ చిత్రంలో రామ్ చరణ్ ఒక కీలక పాత్రను పోషిస్తున్న విషయం తెల్సిందే.