మళ్లీ కేసీఆర్ నోట జాబ్ నోటిఫికేషన్‌

తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఎన్నికల ముందు లేదా ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు మాత్రమే జాబ్ నోటిఫికేషన్‌ ల గురించి మాట్లాడుతాడు అనే ప్రచారం మొదటి నుండి కూడా ఉంది. ఇప్పుడు మరోసారి అదే విషయం నిరూపితం అయ్యింది. గత కొన్నాళ్లుగా అదుగో ఇదుగో అంటూ వాయిదా వేస్తూ వస్తున్న ఉద్యోగాల నోటిఫికేషన్‌ ను అతి త్వరలోనే వేయబోతున్నట్లుగా కేసీఆర్‌ ప్రకటించాడు. వరుసగా రెండు రోజులు మీడియా సమావేశాలు నిర్వహించిన కేసీఆర్ రెండవ రోజు ఉద్యోగాల నోటిఫికేషన్ విషయమై స్పందించడం జరిగింది.

అతి త్వరలోనే తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త చెప్పబోతున్నట్లుగా ప్రకటించాడు. 80 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ను వేయబోతున్నట్లుగా పేర్కొన్నాడు. ఇప్పటి వరకు 1.3 లక్షల ఉద్యోగాలను భర్తీ చేశామన్న కేసీఆర్‌ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు కోట్ల ఉద్యోగాలకు నోటిఫికేషన్ అన్నారు. వారు ఎంతగా చేశారు అంటూ కేసీఆర్ ప్రశ్నించాడు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఆటలు సాగవని.. వారి రాజకీయానికి ఇక్కడి ప్రజలు బలి కావద్దని కేసీఆర్ అన్నాడు. కేంద్రం ఒక వైపు ఒడ్డు కొనుగోలు చేసేది లేదు అని తేల్చి చెప్తుంటే ఇక్కడ మాత్రం బీజేపీ వడ్డు పండించాల్సిందే అంటున్నారు. రైతులను మోసం చేయడం కాక ఇదేంటి అంటూ జనాలు ప్రశ్నిస్తున్నారు.