నాగార్జున సాగర్ ఉప ఎన్నిక త్వరలో జరుగనున్న విషయం తెల్సిందే. టీఆర్ఎస్ ఎమ్మెల్యే మృతితో ఏర్పడిన ఆ స్థానం లో బీజేపీ జెండా ఎగుర వేయాలని ప్రయత్నాలు చేస్తుంది. దాంతో దుబ్బాక తరహాలో అక్కడ ఫలితం మారకుండా ఉండేందుకు టీఆర్ఎస్ ఇప్పటి నుండే ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగానే ఏకంగా సీఎం కేసీఆర్ నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు సంబంధించిన సన్నాహక సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్నిక ఎప్పుడు వచ్చినా కూడా టీఆర్ఎస్ ఘన విజయం సాధించాలనే ఉద్దేశ్యంతో కేసీఆర్ ఈ సభ నిర్వహిస్తున్నారు.
కేవలం సాగర్ ఉప ఎన్నిక మాత్రమే కాకుండా ఎమ్మెల్యే ఎన్నికలు కూడా ఉన్నాయి. పట్టబద్రుల ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఆ ఎన్నికలపై కూడా ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి ఉప ఎన్నిక నేపథ్యంలో కేసీఆర్ నేడు భారీ బహిరంగ సభను నిర్వహించబోతున్నారు. ఈ సభలో కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నాడు. ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నాడు అనేది ఆసక్తికరంగా మారింది. ఈ వేదిక మీదుగా ఏదైనా కీలక ప్రకటన చేస్తాడేమో అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.