గుడిలో ఆ డ్యాన్సులేంటి? టిక్ టాక్ స్టార్ పై నెటిజన్ల ఫైర్

టిక్ టాక్ లో తమ టాలెంట్ ని చూపించిన వారంతా ఆ యాప్ బ్యాన్ కావడంతో ప్రత్యామ్నాయాలు వెదుక్కున్నారు. యూట్యూబ్, ఇన్ స్టాగ్రామ్ రీల్స్.. వంటి వాటిలో తమ టాలెంట్ చూపిస్తున్నారు. అలా టాలెంట్ చూపించిన వారిలో దీపికా పిల్లి కూడా ఉంది. ఆమె డ్యాన్స్, క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ కు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అయితే.. ఆమె రీసెంట్ చేసిన ఓ డ్యాన్స్ బిట్ ను ఫ్యాన్స్ మెచ్చుకున్నా చేసిన ప్రదేశంలో మాత్రం కాంప్రమైజ్ కాలేదు. దీంతో ఆమెను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.

‘లవ్ స్టోరీ’ సినిమాలో ‘సారంగదరియా’ పాట ఇప్పుడు లేటెస్ట్ సెన్సేషన్. ఎంతోమంది ఈ పాటకు తమ డ్యాన్స్ బిట్స్ తో వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీపికా పిల్లి కూడా అలానే చేసింది. కాకపోతే.. ఓ గుడిలో డ్యాన్స్ చేసింది. దీంతో ఆమె డ్యాన్సులను మెచ్చుకునే నెటిజన్లే.. గుడిలో డ్యాన్సులేంటి? అంటూ ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అయింది.