కొరటాల ఒక్క సినిమా కోసమే దేవిని పక్కన పెట్టాడా?

కొరటాల శివ భరత్ అనే నేను చిత్రం తర్వాత దాదాపు రెండున్నరేళ్ల గ్యాప్ తీసుకుని మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేస్తున్నాడు. ఈ ఏడాది ప్రథమార్ధంలో మొదలైన ఆచార్య సినిమా షూటింగ్ కరోనా వైరస్ ప్రభావం కారణంగా బ్రేకులు పడింది. ఆచార్య కొరటాల శివ కెరీర్ లో ఐదవ చిత్రం. ముందు నాలుగు సినిమాలకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించినా ఆచార్య సినిమాకు మణిశర్మతో పనిచేస్తున్నాడు కొరటాల శివ.

దేవి రేంజ్ ఈ మధ్య కొంచెం తగ్గిన విషయం తెల్సిందే. దీంతో చాలా మంది దర్శకులు అతణ్ణి దూరం పెట్టేసారు. అయితే కొరటాల శివ మాత్రం అతణ్ణి కంటిన్యూ చేస్తారని ఆశించారు. ఎందుకంటే కొరటాల సినిమాలకు ఎప్పుడూ దేవి అన్యాయం చేసింది లేదు. చేసిన నాలుగు చిత్రాలకు కూడా బ్లాక్ బస్టర్ ఆడియో ఇచ్చాడు. అయితే ఆచార్యలో దేవితో పనిచేయక పోయినా కొరటాల, దేవి మధ్య సఖ్యత చెడిపోలేదని తెలుస్తోంది.

ఇప్పటికీ ఇద్దరూ టచ్ లోనే ఉన్నారని, ఈ ఒక్క సినిమా తర్వాత మళ్ళీ ఇద్దరం కలిసి పనిచేస్తారని అంటున్నారు. ఆచార్యలో దేవి పనిచేయకపోవడానికి చరణ్, చిరు కారణమని వారే మణిశర్మ పేరుని రికమెండ్ చేసారని తెలుస్తోంది. దేవి కూడా పరిస్థితి అర్ధం చేసుకుని కొరటాల శివతో హెల్తి రిలేషన్ షిప్ మైంటైన్ చేస్తున్నట్లు సమాచారం.