‘బొమ్మరిల్లు’ తర్వాత అంత హిట్‌ ఇదే

‘శతమానం భవతి’ గురించి మాట్లాడినప్పుడల్లా తన బ్యానర్లో మరో బొమ్మరిల్లులాంటి సినిమా అవుతుందని దిల్‌ రాజు అంటుండేవాడు. అతనికి అంతగా నమ్మకం కలిగించిన అంశమేంటో కానీ అది నిజంగానే ఫ్యామిలీ ఆడియన్స్‌కి బాగా గుచ్చుకుంది. అందుకే ఈ చిత్రాన్ని ఎగబడి చూసేస్తున్నారు. సంక్రాంతికి రిలీజ్‌ అయిన పెద్ద సినిమాలైనా స్లో అయ్యాయి

కానీ సెలక్ట్‌ స్క్రీన్స్‌లో రిలీజ్‌ అయిన ‘శతమానం భవతి’ మాత్రం హెవీ ఫుల్స్‌తో రన్‌ అవుతోంది. ఆరు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా పదిహేడు కోట్ల షేర్‌ వసూలు చేసిన ఈ చిత్రం ఈ వీకెండ్‌తో ఇరవై కోట్ల మార్కుని, ఫుల్‌ రన్‌లో ఇరవై అయిదు కోట్ల రేంజ్‌ని చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. దిల్‌ రాజు బ్యానర్లో ‘బొమ్మరిల్లు’ తర్వాత చాలా హిట్లు వచ్చాయి కానీ ‘శతమానం భవతి’ మాత్రమే ఆ స్థాయిలో బ్లాక్‌బస్టర్‌ అయింది.

ఆరు కోట్ల వ్యయంతో దిల్‌ రాజు తీసిన ఈ చిత్రం అన్ని హక్కులు కలుపుకుని ముప్పయ్‌ అయిదు కోట్ల వరకు ఆర్జిస్తుందని అంచనా. అంటే దాదాపు రూపాయికి ఆరు రూపాయలు లాభమన్నమాట. ఈ చిత్రమిచ్చిన ఊపుతో దిల్‌ రాజు తదుపరి చిత్రం ‘నేను లోకల్‌’ కొనడానికి థర్డ్‌ పార్టీల వాళ్లు ఎగబడిపోతున్నారు. దిల్‌ రాజు మీద నమ్మకంతో దీనికి ఎంతయినా ఇచ్చేస్తామని తెగిస్తున్నారు. ఆమధ్య కొంత స్లో అయిన రాజు టైమ్‌ మళ్లీ స్టార్ట్‌ అయిందా ఏంటి?