తెలంగాణ ప్రభుత్వం నుండి తాయిలాలు ఆశిస్తున్న దిల్ రాజు, సురేష్ బాబు

టాలీవుడ్ ప్రముఖ నిర్మాతల్లో దిల్ రాజు, సురేష్ బాబులు కచ్చితంగా ముందు వరసలో ఉంటారు. సినిమాలతో బిజినెస్ చేయడంలో ఇద్దరూ ఆరితేరిపోయారు. ఈ ఇద్దరూ ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. కేవలం సినిమాలను నిర్మించడమే కాకుండా ఈ ఇద్దరూ డిస్ట్రిబ్యూషన్ రంగంలో కూడా ఆరితేరిపోయారు. తమకు నచ్చిన సినిమాలను కొనుగోలు చేసి రెండు తెలుగు రాష్ట్రాల్లో పంపిణీ చేస్తుంటారు. ఎలాగు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా థియేటర్లు వీళ్ళ ఆధీనంలోనే ఉన్నాయి.

అయితే కరోనా వైరస్ సినిమా రంగాన్ని కుదేలు చేసిన విషయం తెల్సిందే. థియేటర్లు లేక డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు చాలా నష్టపోయారు ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. అయితే థియేటర్లు ఓపెన్ చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చినా కూడా ఇంకా రెండు తెలుగు రాష్ట్రాల్లో అడపాదడపా తప్పితే ఎక్కువగా థియేటర్లు తెరుచుకుంది లేదు.

డిసెంబర్ మొదటి వారం నుండి పూర్తి స్థాయిలో థియేటర్లు తెరుచుకుంటాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో సురేష్ బాబు, దిల్ రాజుల ఆధ్వర్యంలోని డిస్ట్రిబ్యూటర్లు రెండు తెలుగు రాష్ట్రాలు వారిని ఆదుకోవడానికి కరెంట్ చార్జీలు, తదితర మిగతా చార్జీలను ఎత్తివేస్తాయని ఊహిస్తున్నాడు. మరి నిజంగానే ఈ ప్రభుత్వాలు సినిమా రంగానికి ఈ సహాయం చేస్తాయా అన్నది వేచి చూడాల్సిందే.