మోస్ట్‌ డిజైరబుల్‌ ఉమెన్‌ గా దివి పాప

హీరోయిన్ గా ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీ బిజీగా ఉన్న దివి బేబీ అరుదైన గుర్తింపును దక్కించుకుంది. గత ఏడాది బిగ్‌ బాస్ కారణంగా ఒక్కసారిగా స్టార్‌ అయిన దివి ప్రస్తుతం సినిమాలు మరియు వెబ్‌ సిరీస్ లతో బిజీ అవుతుంది. ఈ సమయంలో 2020 టీవీ పరిశ్రమకు చెందిన మోస్ట్‌ డిజైరబుల్‌ ఉమెన్ గా దివి నిలిచింది. హైదరాబాదీ మోస్ట్‌ డిజైరబుల్‌ ఉమెన్ గా గుర్తింపు దక్కించుకున్న దివి నెట్టింట సందడి చేస్తోంది.

బిగ్ బాస్‌ సీజన్‌ 4 తో మోస్ట్‌ డిజైరబుల్‌ ఉమెన్‌ గా నిలిచిన దివి మాట్లాడుతూ.. తన అందం కంటే అభిమానులు తన యొక్క పద్దతి మరియు ప్రవర్తన గురించి ఆసక్తి చూపిస్తున్నారు. బ్యూటీ విత్‌ బ్రెయిన్‌ అంటూ నన్ను అంతా అంటూ ఉంటే చాలా ఆనందంగా ఉందని పేర్కొంది. టైమ్‌ వల్ల బ్యూటీ తగ్గుతుందేమో కాని ఇంటిలిజెన్స్ మాత్రం తగ్గదని ఆమె పేర్కొంది. మొత్తానికి ఈ మోస్ట్‌ డిజైరబుల్‌ ట్యాగ్‌ తో దివి సోషల్‌ మీడియాలో మరింతగా పాపులర్ అవ్వడం ఖాయం అంటున్నారు. ఇటీవల దివి నటించిన క్యాబ్‌ స్టోరీ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓటీటీ రిలీజ్ అయిన ఆ సినిమా నిరాశ పర్చింది. అయినా కూడా దివికి మంచి గుర్తింపు అయితే వచ్చింది.