సినిమా ప్రపంచంలో భాషతో సంబంధం ఉండదు.. కంటెంట్ నచ్చితే చాలు ఎవరి భాషల్లో, వారి వారికి తగ్గ మార్పులతో రీమేక్ చేస్తుంటారు. అలా మలయాళంలో రూపొంది ఇండియాలోనే కాకుండా చైనాలో కూడా రీమేక్ అయిన సినిమా ‘దృశ్యం’. తెలుగు వారికి బాగా పరిచయం ఉన్న మోహన్ లాల్ – మీనా కలిసి నటించిన దృశ్యం సినిమా జీతూ జోసెఫ్ డైరెక్షన్ లో 2013లో విడుదలై బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
అంతే కాకుండా ఆ తర్వాత తెలుగు(విక్టరీ వెంకటేష్ హీరోగా నటించారు), తమిళ్, కన్నడ, హిందీ, సింహళ(శ్రీలంక) భాషల్లోనే కాకుండా, మొట్ట మొదటి సారి చైనీస్ లో రీమేక్ అయినా వన్ అండ్ ఓన్లీ ఇండియన్ ఫిల్మ్ ‘దృశ్యం’. విడుదలైన ప్రతి భాషలో హిట్ అవ్వడం ఈ సినిమాకి దక్కిన మరో రికార్డ్. నేడు మోహన్ లాల్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా దృశ్యం ఒరిజినల్ చిత్ర దర్శకుడు జీతూ జోసెఫ్ దృశ్యం సీక్వెల్ కథని సిద్ధం చేశారట. ఇప్పటికే మోహన్ లాల్ కి చెప్పి గ్రీన్ సిగ్నల్ కూడా పొందారు. ఇందులో కూడా మోహన్ లాల్ – మీనా ముఖ్యపాత్రలు పోషిస్తారు. లాక్ డౌన్ పూర్తి ఎత్తేసి, సినిమా షూటింగ్స్ కి పర్మిషన్ ఇవ్వగానే షూటింగ్ మొదలు పెట్టడానికి డిసైడ్ అయ్యారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ ఈఏడాది లేదా వచ్చే ఏడాది మొదట్లో దృశ్యం సీక్వెల్ రిలీజ్ ఉంటుంది.
మరి మొదటి పార్ట్ లానే సెకండ్ పార్ట్ కూడా అన్ని భాషల్లో రీమేక్ అవుతుందేమో చూడాలి. ‘జనతా గ్యారేజ్’, ‘మనమంతా’, ‘లూసిఫర్’ సినిమాలతో మళ్ళీ తెలుగు వారికి దగ్గరైన మోహన్ లాల్ కి తెలుగుబుల్లెటిన్.కామ్ తరపున జన్మదిన శుభాకంక్షాలు తెలియజేస్తున్నాం.