టీడీపీ నేత, మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధినేత పొంగూరు నారాయణను ఏపీ పోలీసులు హైదరాబాద్ లోని కొండాపూర్ లోని ఆయన నివాసానికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. ఏపీ పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఏపీ సీఐడీ పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి ఏపీకి తరలిస్తునట్టు సమాచారం.
ఇటివల ఏపీలో జరిగిన పదో తరగతి పరీక్షల ప్రశ్నాపత్రాలు వరుసగా లీక్ అయ్యాయి. సంచలనం రేపిన ఈ అంశంలో ప్రభుత్వంపై విమర్శలు వచ్చాయి. అయితే.. ఈ వ్యవహారం వెనుక నారాయణ, శ్రీచైతన్య విద్యాసంస్థలు ఉన్నట్టు సాక్షాత్తూ సీఎం జగన్ ఇటివల తిరుపతి సభలో వ్యాఖ్యానించారు. దీంతో ఈ అంశం సంచలనం రేపింది. ఈనేపథ్యంలోనే ఏపీ సీఐడీ పోలీసులు హైదరాబాద్ వచ్చి నారాయణను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.