బర్త్‌డే స్పెషల్‌: తడబడుతూ నిలబడుతూ వస్తున్న గోపీచంద్‌

ప్రముఖ తెలుగు దర్శకుడు టి కృష్ణ తనయుడు గోపీచంద్‌. తండ్రి మరణించడంతో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చేందుకు కొంత ఇబ్బంది పడ్డాడు. తొలి వలపు చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన గోపీచంద్‌ ఆ సినిమా నిరాశ పర్చడంతో విలన్‌గా మారాడు. జయం, నిజం చిత్రాల్లో విలన్‌గా నటించి బాబోయ్‌ అనిపించిన గోపీచంద్‌ మళ్లీ యజ్ఞం చిత్రంతో హీరోగా పున: పరిచయం అయ్యాడు. ఈసారి సక్సెస్‌ దక్కించుకున్న గోపీచంద్‌ మళ్లీ తిరిగి వెనక్కు చూసుకోలేదు. వరుసగా బ్లాక్‌ బస్టర్స్‌ రాకున్నా ఒక మోస్తరు సక్సెస్‌తో కొన్ని ఫెయిల్యూర్స్‌తో గోపీచంద్‌ కెరీర్‌ కొనసాగుతూ వస్తోంది.

గత కొంత కాలంగా వరుసగా ఫ్లాప్స్‌తో సహవాసం చేస్తున్న గోపీచంద్‌కు ఇంకా కూడా కెరీర్‌పై నమ్మకం ఉంది. ప్రస్తుతం రెండు సినిమాలను హీరోగా లైన్‌లో పెట్టాడు. వెంటనే మరో సినిమాను కూడా ఈయన చేసేందుకు రెడీగానే ఉన్నాడు. సక్సెస్‌ ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా వరుసగా చిత్రాలు చేస్తున్న గోపీచంద్‌కు విలన్‌ ఛాన్స్‌లు కూడా వస్తున్నాయి. ఆమద్య రజినీకాంత్‌ మూవీలో విలన్‌ పాత్రకు గాను ప్రముఖ దర్శకుడు శివ ఆఫర్‌ చేశాడట. కాని దానికి గోపీచంద్‌ సున్నితంగా నో చెప్పాడని సినీ వర్గాల్లో టాక్‌.

గోపీచంద్‌ మరో రెండు మూడు సంవత్సరాల వరకు హీరోగా ప్రయత్నాలు చేసి ఆ తర్వాత విన్‌గా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. హీరోగా సక్సెస్‌లు రాని కొందరు హీరోలు విలన్‌ పాత్రలకు మొగ్గు చూపుతున్నారు. గోపీచంద్‌ కూడా అదే దారిలో వెళ్లడం కరెక్ట్‌ అంటున్నారు. గతంలో విలన్‌ గా దుమ్ము రేపిన గోపీచంద్‌ మళ్లీ విలన్‌గా చేస్తే ఖచ్చితంగా సక్సెస్‌లు వస్తాయనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాలు సైతం వ్యక్తం చేస్తున్నాయి.