సందీప్ కిషన్ సినిమాలో విలాన్ గా రొమాంటిక్ డైరెక్టర్

రొమాంటిక్ సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన పేరు తెచ్చుకున్నాడు గౌతమ్ వాసుదేవ్ మీనన్. యాక్షన్, రొమాన్స్ కలగలిపి సినిమాలు తీసే గౌతమ్ మీనన్ కు తమిళ్ తో పాటు తెలుగులో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. అయితే గత కొంత కాలంగా గౌతమ్ నుండి సాలిడ్ సినిమా రాలేదు. అయితే 2020లో విడుదలైన కనులు కనులను దోచాయంటే చిత్రం ద్వారా మాత్రం గౌతమ్ కు డిఫెరెంట్ ఇమేజ్ వచ్చింది.

ఆ సినిమాలో పోషించిన పోలీస్ పాత్ర ద్వారా గౌతమ్ మీనన్ కు నటుడిగా అవకాశాలు పెరిగాయి. తమిళ్ లో రెండు, మూడు ఓటిటి చిత్రాలు చేసిన గౌతమ్ ఇప్పుడు సందీప్ కిషన్ ప్యాన్ ఇండియన్ చిత్రంలో విలన్ గా చేస్తున్నాడు.

విజయ్ సేతుపతి మరో ప్రధాన పాత్ర పోషిస్తోన్న ఈ చిత్రానికి మైఖేల్ అనే టైటిల్ ను కన్ఫర్మ్ చేసారు. రంజిత్ జయకోడి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలవుతుంది.