నిఖిల్ ప్యాన్ ఇండియన్ చిత్రం స్పై విడుదల తేదీ ఖరారు

యంగ్ హీరో నిఖిల్ కూడా ప్యాన్ ఇండియా అదృష్టాన్ని పరీక్షించుకోవాలి అనుకుంటున్నాడు. తన నెక్స్ట్ సినిమాను ప్యాన్ ఇండియా లెవెల్లో విడుదల చేయబోతున్నాడు. ఎడిటర్ గ్యారీ బిహెచ్ దర్శకుడిగా మారి చేస్తోన్న తొలి ప్రయత్నమిది.

ఈ చిత్రంలో నిఖిల్ స్పై గా కనిపించబోతున్నాడు. ఇక ఈ చిత్ర ఫస్ట్ లుక్ అందరి దృష్టిని ఆకర్షించింది. గన్స్, బులెట్స్, స్నిపర్ గన్ స్కోప్ తో లెథర్ బ్లాక్ టి షర్ట్, బ్లాక్ జాకెట్, బ్లాక్ కార్గో పాంట్స్, క్లాసిక్ అవియటర్స్ తో స్టైలిష్ గా అదరగొట్టాడు.

ఈ చిత్రాన్ని దసరా 2022లో తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. కె రాజశేఖర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. శ్రీచరణ్ పాకల స్పై కు సంగీతాన్ని అందిస్తున్నాడు. ఐశ్వర్య మీనన్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.