మహిళ ఉద్యమ నాయకుడిగా స్టార్‌ హీరో

తమిళ స్టార్‌ హీరో సూర్య ఇటీవల సూరారై పొట్రు సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడం తో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కించుకుంది. అద్బుత సినిమా అంటూ ఆస్కార్‌ బరిలో కూడా నిలిచింది. ఆ సినిమా తర్వాత సూర్య చేస్తున్న సినిమా అనగానే అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉండటం చాలా కామన్‌ విషయం. ఇలాంటి సమయంలో పాండిరాజ్ దర్శకత్వంలో ఆయన సినిమా చేస్తే మరింతగా అంచనాలు ఉంటాయి. వీరి కాంబోలో రూపొందుతున్న సినిమా వాస్తవ సంఘటల ఆధారంగా రూపొందిస్తున్నట్లుగా చెబుతున్నారు.

కొన్ని సంవత్సరాల క్రితం పొల్లాచి ప్రాంతంలో మహిళలపై అత్యాచారాలు జరిగాయి. ఆ సమయంలో మహిళ కోసం ఒక వ్యక్తి ఉద్యమం చేశాడు. ఆ వ్యక్తి చుట్టు కథ అల్లుతూ కమర్షియల్‌ యాంగిల్‌ లో సమాజానికి మెసేజ్ ఇచ్చే విధంగా సినిమాను రూపొందించినట్లుగా చెబుతున్నారు. 50 శాతం షూటింగ్‌ పూర్తి చేసిన మేకర్స్ సెకండ్‌ వేవ్‌ వల్ల ఆగిపోయారు. మళ్లీ ఈ సినిమా షూటింగ్ పునః ప్రారంభంకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.