హైపర్ ఆది పెళ్లికి వేళాయె

జబర్దస్త్‌ అంటే హైపర్‌ ఆది అన్నంతగా ఇప్పుడు పరిస్థితి మారింది. ఆయన జబర్దస్త్ లో చేస్తున్న కామెడీ స్కిట్‌ లు సూపర్‌ డూపర్ హిట్స్ అవ్వడంతో పాటు ఆయన పంచ్‌ ల పరంగా సరికొత్త ట్రెండ్‌ ను సెట్‌ చేశాడు. స్కిట్ మొత్తం కూడా పంచులతో నింపేయగల సత్తా ఆదికి ఉంది. అలాంటి ఆది ప్రస్తుతం వెండి తెరపై కూడా సందడి చేస్తూనే ఉన్నాడు. ఈయన చేసిన హడావుడి తో పలు సినిమాలు కూడా ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నాయి. ఈ సమయంలో ఆది పెళ్లి పీఠలు ఎక్కేందుకు సిద్దం అవుతున్నాడు.

తన సొంత జిల్లా ప్రకాశం కు చెందిన ఒక వ్యాపారవేత్త కూతురును ఆది వివాహం చేసుకోబోతున్నాడట. ఇప్పటికే ఆది పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం అందుతోంది. పెళ్లికి సంబంధించిన చర్చలు పూర్తి అయ్యాయి అని మంచి రోజులు ఉంటే త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ జబర్దస్త్‌ కమెడియన్స్ ద్వారా తెలుస్తోంది. 2021 లో ఆది పెళ్లి పీఠలు ఎక్కడ మాత్రం ఖాయం అంటున్నారు. ఆయన కూడా ఈ మద్య వరుసగా సొంత ప్రాంతంకు వెళ్తున్నాడు. దాంతో పెళ్లి వార్తలు నిజం అయ్యి ఉంటాయని ఎక్కువ మంది అంటున్నారు.