కరోనాతో ట్రంప్ ఓడిపోతే వాళ్ల ఫ్రెండ్ మోడీ ఓడిపోయినట్లేనా?


ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి అమెరికా ఎన్నికల వేళ అక్కడి రాజకీయాలను వణికిస్తోంది. ట్రంప్ అమెరికా ఎకానమీని పెంచాలని చాలా ప్రయత్నాలు చేసి సక్సెస్ అయ్యాడు. కానీ ట్రంప్ మీద ఎందుకో అమెరికన్స్ కు నమ్మకం లేక అన్ని సర్వేల్లో వెనుకబడుతున్నాడు. ట్రంప్ ప్రత్యర్థి జో బిడెన్ సర్వేల్లో ముందంజలో ఉంటున్నాడు. కొందరు బిడెన్ నే గెలిపిస్తాము అని చెప్తున్నారు.
కరోనాను ట్రంప్ సరిగా హ్యాండిల్ చేయలేదు అనే ఆరోపణలున్నాయి.. అయితే ఇక్కడే ట్విస్ట్ ఉంది. ట్రంప్ ఫ్రెండ్ అయిన భారత ప్రధాన మంత్రి మోడీ అహ్మదాబాద్ లో ‘నమస్తే ట్రంప్’ ప్రోగ్రాం పెట్టిన తర్వాత దేశంలో కరోనా విపరీతంగా పెరిగిందని కొందరి వాదన. అయితే ఏది ఏమైనా కరోనాను హ్యాండిల్ చేయడంలో మోడీ అట్టర్ ఫ్లాప్ అయ్యాడన్నది మాత్రం అందరూ ఆరోపిస్తున్న విషయం.
అదే కాకుండా 20 లక్షల కోట్ల ప్యాకేజీ అని ఎవరికీ ఉపయోగపడని ప్యాకేజీతో ఒక సుద్ద దండగ మాటలతో ప్రజలను మోసగించాడు అని మరో వాదన ఉంది. అయితే మోడీకి ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది. ఎన్నికల వరకు మోడీ మీద ఉన్న అపవాదం అప్పటివరకు ఉంటుందా? అనేది కూడా చూడాలి. అయితే రాహుల్ గాంధీ మెల్లిమెల్లిగా పుంజుకుంటున్నారు. ట్రంప్ ఓడిపోతే మోడీ ఓడిపోయినట్లే అనేది ఇంకొక వాదన.
ఆపత్కాలం వేళ వలస కార్మికులు దేశ ప్రజలను వదిలేసిన మోడీ తీరుపై జనం ఆగ్రహంగా ఉన్నారు. ఉద్యోగ ఉపాధి పోయి నిరుద్యోగులు ఉద్యోగులు మంటగా ఉన్నారు. అరచేతిలో మోడీ స్వర్గం చూపిస్తున్నారని అందరికీ అర్థమవుతోంది. అక్కడ ట్రంప్ ఓడిపోతే.. సేమ్ అలాంటి ఊదరగొట్టే పనులు చేస్తున్న ఆయన ప్రియమైన దోస్త్ మోడీ కూడా ఓడిపోవడం ఖాయమన్న వాదన తెరపైకి వచ్చింది. కరోనానే ట్రంప్ మోడీలను ఓడిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.