‘నేను నా ప్రపంచం’ అల్లు అర్జున్‌ ఫిలాసఫీ!

‘బాహుబలి 2’ ట్రెయిలర్‌ చూసి సినిమా ఇండస్ట్రీ అంతా ‘ఔరా’ అంటూ ప్రశంసలు కురిపించింది. అల్లు అర్జున్‌ మాత్రం అటు బాహుబలి గురించి కానీ, ఇటు తమ కుటుంబానికి చెందిన హీరో కాటమరాయుడు గురించి కానీ ఏమీ వ్యాఖ్యానించలేదు.

అయితే తన ‘దువ్వాడ జగన్నాథమ్‌’ టీజర్‌కి కోటి వ్యూస్‌ వచ్చాయనే ఆనందాన్ని మాత్రం అభిమానులతో పంచుకున్నాడు. మిగిలిన సినిమాల ట్రెయిలర్లు ఎలాగున్నాయో తనకి అనవసరమన్నట్టు, తన టీజర్‌ సక్సెస్‌ అయినందుకు హ్యాపీగా వున్నట్టు బన్నీ ఈ ట్వీట్‌తో ఇన్‌డైరెక్టుగా చెప్పాడు. మరో వైపు తన తమ్ముడు అన్ని సినిమాల ట్రెయిలర్స్‌పై స్పందిస్తూ సగటు సినీ ప్రియుడిలా ఉత్సాహపడుతోంటే అల్లు అర్జున్‌ మాత్రం ‘నేను నా ప్రపంచం’ అనుకుంటూ మిగతా వారి సంగతులు తనకి పట్టవన్నట్టు ఉండిపోతున్నాడు.

పవన్‌కళ్యాణ్‌లా కనీసం తన సినిమాల గురించి కూడా మాట్లాడుకోకపోవడం ఒక పద్ధతి. స్టార్‌డమ్‌ వచ్చిన తర్వాత ఇలా సెల్ఫ్‌ సెంటర్డ్‌గా వ్యవహరించడం వల్ల నెగెటివ్‌ వైబ్స్‌ స్ప్రెడ్‌ అయ్యే ప్రమాదముంటుంది. అవతలి వారి చిత్రాల గురించి పొగిడిన వారంతా మనస్ఫూర్తిగా వాటిని మెచ్చుకున్నారని కాదు. కాకపోతే ఎలాంటి భేషజాలు లేవు, అందరివాడు అనిపించుకోవడానికి ఒక మాటనేస్తుంటారు. లౌక్యం బాగా తెలిసిన అల్లు అరవింద్‌ నుంచి అల్లు అర్జున్‌ కాస్త కూడా అది నేర్చుకోకపోవడం విచిత్రమే సుమీ.