ఎక్స్ క్లూజివ్: మెగా ‘బాక్సింగ్‌’ లో జగ్గూబాయ్

మెగా హీరో వరుణ్‌ తేజ్‌ తాజా చిత్రం ‘బాక్సింగ్‌’. కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వంలో ఈ సినిమాలు అల్లు అరవింద్‌ పెద్దబ్బాయి అల్లు బాబి తన సన్నిహితుడు సిద్దు ముద్దతో కలిసి నిర్మిస్తున్నాడు. అంతర్జాతీయ స్థాయి బాక్సింగ్‌ విజేతలతో వరుణ్‌ తేజ్‌ కు బాక్సింగ్‌ లో మెలకువలు నేర్పించడంతో పాటు బాక్సింగ్‌ సీన్స్‌ ను వారి ఆధ్వర్యంలో చిత్రీకరించినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్‌ ముగింపు దశకు వచ్చింది. ఈ సినిమాలో మెయిన్‌ విలన్‌ ఎవరు అనే విషయంలో ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. ఎట్టకేలకు మెయిన్‌ విలన్‌ గా జగపతి బాబు కనిపించబోతున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

ఈమద్య కాలంలో ఎక్కువ పెద్ద సినిమాల్లో విలన్‌గా జగపతిబాబు కనిపిస్తున్నాడు. ఈ సినిమా కోసం ఆయనే బెస్ట్‌ ఛాయిస్‌ అన్నట్లుగా మేకర్స్‌ భావించారట. జగపతిబాబు బాక్సింగ్‌ బ్యాక్‌ గ్రౌండ్‌ తో కనిపించబోతున్నట్లుగా చెబుతున్నారు. సాయి ధరమ్‌ తేజ్‌ విన్నర్‌ సినిమాతో పాటు పిల్లా నువ్వు లేని జీవితం సినిమాల్లో కీలక పాత్రలు పోషించిన జగ్గూ భాయ్‌ ఈ సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటాడా అనే నమ్మకం వ్యక్తం అవుతోంది. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళం.. హిందీ ఇంకా ఇతర భాషల్లో కూడా జగ్గూ భాయ్‌ ప్రస్తుతం బిజీగా ఉన్నారు.

1990ల్లో స్టార్‌ హీరోగా వెలుగు వెలిగిన జగపతిబాబు కొంత కాలంగా వరుసగా విలన్‌ పాత్రలను క్యారెక్టర్‌ ఆర్టిస్టగా నటిస్తూ వస్తున్నాడు. ఫ్యామిలీ హీరో అయిన జగపతిబాబును విలన్ గా చూడగలమా అనే అనుమానాలు ఉన్న నేపథ్యంలో లెజెండ్‌ సినిమాలో అద్బుతమైన పాత్రను పోషించి వావ్‌ అనిపించాడు. అరవింద సమేత సినిమాలో అత్యంత క్రూరమైన విలన్‌ గా నటించాడు. అందుకే బాక్సింగ్‌ సినిమాకు జగ్గూభాయ్‌ అదనపు బలంగా నిలుస్తాడనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.