రెండేళ్లుగా మహమ్మారీ కొనసాగుతున్నా అందాల యువనటి జాన్వీ కపూర్ కెరీర్ కి వచ్చిన డోఖా ఏం లేదు. ఓవైపు జాన్వీ నటించిన సినిమాలు విడుదలకు వస్తుంటే.. వరుస చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. మరోవైపు సోషల్ మీడియాల్లో వరుస ఫోటోషూట్లతో ఫాలోవర్స్ ని భారీగా పెంచుకుంది. ఈ లాక్ డౌన్ ని జాన్వీ సద్వినియోగం చేసుకున్నంతగా మరెవరూ చేయలేదేమో!
గత సంవత్సరం మహమ్మారి సీజన్ లోనూ థియేట్రికల్ విడుదల కలిగిన ఏకైక యువ తారగా జాన్వీ పేరు వినిపించింది. రూహి (2021) చాలా సినిమాల భవితవ్యం అనిశ్చితంగా ఉన్న కఠినమైన సమయంలో విడుదలైంది. పైగా తనకు పేరును తెచ్చింది. దీనిపై జాన్వీ మాట్లాడుతూ.. ఇది నాకు చాలా అదృష్టంగా అనిపించింది. మహమ్మారి సమయంలో సినిమాల వాతావరణాన్ని అంచనా వేయడానికి ఇది ఒక ప్రయోగం. ప్రజలు మంచి సంఖ్యలో చూడటానికి థియేటర్లలోకి వచ్చారు. ఇది ప్రోత్సాహకరంగా అనిపించింది.. అని జాన్వీ అన్నారు.
ప్రస్తుతం ఆమె చేతిలో మిస్టర్ అండ్ మిసెస్ మహి- గుడ్ లక్ జెర్రీ- మిల్లీ సినిమాలు ఉన్నాయి. ఒక నటిగా అండర్-ఎక్స్పోజ్డ్ ఫీలింగ్ గురించి కపూర్ గాళ్ చమత్కరించింది. నా చిత్రాల గురించి నేను చాలా థ్రిల్లింగ్ గా ఉన్నాను. వాటన్నింటి గురించి చాలా ఆశాజనకంగా ఉన్నాను. అన్నింటికంటే ఎక్కువగా నా తదుపరి ప్రాజెక్ట్ లలో నేను పోషించబోయే పాత్రల ప్రక్రియను ప్రిపేరయ్యేందుకు ఉత్సాహంగా ఉన్నాను.. అని తెలిపారు.
మిల్లీలో ఆమె తన తండ్రి నిర్మాత బోనీ కపూ ర్తో కలిసి పని చేయడం కూడా ఆమెను మరింత ఉత్సాహపరిచింది. అతను ఎంత గొప్ప నిర్మాత ..నాన్న తన దర్శకులను అతని మొత్తం బృందాన్ని ఎలా పాడు చేస్తాడనే దాని గురించి నేను ఎప్పుడూ కథలు వింటూనే ఉంటాను. నేను దానికి సాక్షిగా నిలిచాను. కలిసి తగినంత సమయం గడపకూడదనే భయం ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ అనుభవం మేము వృత్తిపరంగా ఒకరికొకరు ముడిపడి ఉన్నామని నిర్ధారిస్తుంది. అందుకు నేను చాలా కృతజ్ఞతగా భావిస్తున్నాను.. అని 24 ఏళ్ల జాన్వీ తెలిపింది.
అయితే ఓమిక్రాన్ కేసుల పెరుగుదల – షోబిజ్ పై దాని పర్యవసానాల గురించి జాన్వీ ఆందోళన చెందుతున్నారా? అంటే.. నేను ఇప్పుడే థియేట్రికల్ రిలీజ్ ల గురించి తెలుసుకుంటున్నాను. షూటింగ్ జీవితాన్ని తిరిగి ప్రారంభించాము. ఆర్థిక పరిస్థితులు ఉద్యోగ అవకాశాలు ప్రతి ఒక్కరికి వారి విడుదలల పట్ల ఉన్న దృష్టి గురించి నేను ఆందోళన చెందుతున్నాను. ఇలా చెప్పిన తరువాత ఈ క్లిష్ఠ పరిస్థితిలో ప్రజల ఆరోగ్యం- శ్రేయస్సు – వారి జీవితాలు ప్రమాదంలో ఉన్నందున మన స్వార్థానికి ఆలోచించకూడదని భావిస్తాను.దేశం యొక్క భవిష్యత్తు ప్రమాదంలో ఉంది అని కూడా జాన్వీ కపూర్ బాధ్యతాయుతంగా మాట్లాడారు.