కరణ్ పార్టీలో జాన్వీ సోలోగానే..!

ప్రముఖ దర్శకనిర్మాత కరణ్ జోహార్ 50వ పుట్టినరోజు వేడుకలు అత్యంత వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకల్లో పలు జంటలు కన్నుల పండుగగా కనిపించాయి. అయితే కొన్ని వారాల క్రితం ఊటీలో తన బాయ్ఫ్రెండ్ ఓర్హాన్ అవత్రమణితో రొమాంటిక్ డేట్ ని ఆస్వాధించిన జాన్వీ కపూర్ ఈ వేడుకల్లో జంటగా ప్రత్యక్షమవుతుందంటూ గుసగుసలు వినిపించాయి. కానీ ఈసారి అలా జరగలేదు.

ఇక జాన్వీ తన కజిన్ షానాయ కపూర్ సహా ఇతర సాధారణ స్నేహితులతో గతంలో పార్టీకి ఎటెండయ్యింది. కానీ ఈసారి కరణ్ పార్టీలో జాన్వీ సోలోగా మాత్రమే కనిపించిందన్న గుసగుస వినిపించింది. తన లవ్ లైఫ్ ని జాన్వీ బహిర్గతం చేసేందుకు ఆసక్తిగా లేదన్న టాక్ పార్టీలో స్ప్రెడ్ అయ్యింది.

ఈ సందర్భంగా మరోసారి జాన్వీ ప్రియుడితో పార్టీలో ఉన్న త్రోబ్యాక్ ఫోటోలను అభిమానులు షేర్ చేస్తున్నారు. ఇన్ స్టాగ్రామ్ లో జాన్వీ ఇంతకుముందు నైట్ పార్టీ నుండి అనేక ఫోటోలను పంచుకున్నారు. షానయ బ్లాక్ కో-ఆర్డ్స్ లో కనిపించగా.. బ్లాక్ టీషర్ట్- నియాన్ పసుపు ప్యాంటులో జతగాడైన ఓర్హాన్ ను జాన్వీ కౌగిలించుకుని కనిపించింది.

జాన్వీ పోస్ట్ పై షానయ పసుపు రంగు గుండె ఎమోజీలను షేర్ చేసింది. గత నెలలో ఊటీకి వెళ్లినప్పుడు జాన్వీ తన సోదరి ఖుషీ కపూర్ తో కలిసి ఓర్హాన్ కూడా ఉన్నారు.

ఈ సంవత్సరం ప్రారంభంలో జాన్వీ కపూర్ తిరుమలలో తన గాళ్స్ గ్యాంగ్ తో కలిసి తన 25వ పుట్టినరోజు వేడుకలను జరుపుకున్న ఫోటోలు వైరల్ అయ్యాయి.