జాతిరత్నాలు క్లోజింగ్ కలెక్షన్స్: లాభాలు ఓ రేంజ్ లో…

నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి హీరోలుగా నటించిన సినిమా జాతిరత్నాలు. ఈ మధ్య కాలంలో వచ్చిన ఉత్తమ చిత్రాల్లో ఒకటిగా జాతిరత్నాలు నిలిచింది. ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన జాతిరత్నాలు అందరి మనసులను గెలుచుకుంది. మార్చ్ 11న విడుదలైన జాతిరత్నాలు చిత్రం నెలరోజుల తర్వాత మొత్తానికి ఫుల్ రన్ కు చేరుకుంది. అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా అవైలబుల్ లోకి వచ్చింది.

ఇక జాతిరత్నాలు ఫుల్ రన్ కలెక్షన్స్ చూసుకుంటే మైండ్ బ్లాక్ అవ్వడం మాత్రం ఖాయం. అన్ని ప్రాంతాల్లో కలుపుకుని 10 కోట్లకు పైగా బిజినెస్ ను చేసింది జాతిరత్నాలు. దీంతో 11 కోట్లకు టార్గెట్ చేరుకుంది. అయితే అందరి అంచనాలను దాటుకుని ఈ సినిమా 70 కోట్లకు పైగా గ్రాస్ ను వసూలు చేసింది. 39 కోట్ల షేర్ ను చేసింది. దీంతో జాతిరత్నాలు సినిమా 27 కోట్లకు పైగా లాభాలను వసూలు చేసినట్లు అయింది.