తమిళ స్టార్ దర్శకుడు శివ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తండ్రి జయకుమార్ ఈరోజు కన్నుమూశారు. వయసు రీత్యా వచ్చిన ఆరోగ్య సమస్యల వల్ల ఆయన చనిపోయినట్లు తెలుస్తోంది. జయకుమార్ ప్రముఖ షార్ట్ ఫిల్మ్ మేకర్ మరియు డాక్యుమెంటరీ ఫోటోగ్రాఫర్. ప్రముఖ షార్ట్ ఫిల్మ్స్ దర్శకుడు కూడా. దాదాపు 400 సినిమాలకు పనిచేసారు.
సినిమాల మీద ఉన్న ఆసక్తితో కొడుకు శివను కూడా సినిమాలవైపు ప్రోత్సహించాడు. తెలుగులో శంఖం, శౌర్యం, దరువు వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన శివ, తమిళ్ లో స్టార్ స్టేటస్ ను అందుకున్నాడు. విక్రమార్కుడు రీమేక్ శిరుతైతో తన సత్తా చూపించాడు. తర్వాత అజిత్ తో వరసగా వేదాళం, విశ్వాసం, వివేగం సినిమాలను తెరకెక్కించాడు. ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా అన్నాత్తై చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.
జయకుమార్ అంత్యక్రియలు ఈరోజు చెన్నైలో జరుగుతాయి. జయకుమార్ మృతి పట్ల శివకు ఇండస్ట్రీ వర్గాల నుండి సంతాపం వ్యక్తమవుతోంది.