తెలుగు దేశం పార్టీ నాయకుడు.. మాజీ ఎమ్మెల్యే అయిన జేసీ ప్రభాకర్ ఇప్పటికే పలు కేసులతో సతమతం అవుతున్నారు. ఆయన తాజాగా జైలుకు వెళ్లి వచ్చాడు. ఆయన ఇటీవలే బెయిల్ పై బయటకు వచ్చాడు. ఈ సమయంలో ఆయన మరో కేసులో చిక్కకున్నాడు. ఇటీవల ఆయన తాడిపత్రి వచ్చిన సమయంలో ఆయన మద్దతుదారులు భారీగా ర్యాలీ నిర్వహించారు. కోవిడ్ నింబధనలు ఉన్న సమయంలో ర్యాలీకి అనుమతులు లేవు. కాని ప్రభాకర్ రెడ్డి ర్యాలీలో పాల్గొనడం వల్ల ఆయనపై కేసు నమోదు అయ్యింది.
కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి మరియు ఆయన తనయుడు అస్మిత్ రెడ్డిలతో పాటు మరో 32 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరబాద్ లో కరోనా చికిత్స చేయించుకుని కరోనాను జయించి తాడిపత్రి వచ్చిన సందర్బంగా అభిమానులు ర్యాలీ నిర్వహించడం వివాదాస్పదం అయ్యింది. ఆయనకు అదే మరోకేసును తెచ్చి పెట్టింది. పోలీసుల ముందు హాజరు అయ్యి జేసీ ప్రభాకర్ రెడ్డి మరియు అస్మిత్ రెడ్డిలు ఈ విషయమై వివరణ ఇవ్వాల్సి ఉంటుంది.