బర్త్‌డే స్పెషల్‌ : పుష్కర కాలమయిన తరగని ‘చందమామ’ అందం

టాలీవుడ్‌లో సుదీర్ఘ కాలంగా స్టార్‌ హీరోయిన్‌గా వెలుగు వెలుగుతున్న ముద్దుగుమ్మ కాజల్‌. ఈ అమ్మడు తెలుగులో చేసిన మొదటి సినిమానే ఫ్లాప్‌ అయ్యింది. కాని రెండవ సినిమాతో సూపర్‌ హిట్‌ దక్కించుకుని కెరీర్‌ ఆరంభంలోనే రాజమౌళి వంటి దిగ్గజ దర్శకుడి చేతిలో పడి పుష్కర కాలంగా టాలీవుడ్‌ లో టాప్‌ హీరోయిన్‌గా కొనసాగుతూ వస్తోంది. తెలుగులో ప్రస్తుతం ఉన్న హీరోయిన్స్‌లో సుదీర్ఘ కెరీర్‌ ను కలిగి ఉన్న అతి కొద్ది హీరోయిన్స్‌లో కాజల్‌ కూడా ఒకరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. గ్లామర్‌ సీన్స్‌, ముద్దు సీన్స్‌తో పాటు మంచి నటన ప్రతిభ కూడా ఉన్న కాజల్‌ అగర్వాల్‌ టాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌గా నిలిచేలా చేశాయి.

2004వ సంవత్సరంలో హిందీలో క్యూ హో గయా నా అనే చిత్రంతో పరిచయం అయిన ఈ అమ్మడు తెలుగులో 2007వ సంవత్సరంలో లక్ష్మీ కళ్యాణం చిత్రంతో పరిచయం అయ్యింది. తేజ ఈ అమ్మడిని టాలీవుడ్‌కు పరిచయం అయ్యింది. ఆ సినిమా నిరాశపర్చినా కూడా కృష్ణవంశీ దృష్టిలో పడినది. దాంతో చందమామ చిత్రంలో ఛాన్స్‌ ఇచ్చాడు. ఆ సినిమాలో కాజల్‌దే లీడ్‌ రోల్‌. ఆ పాత్రకు పూర్తి న్యాయం చేసిన కాజల్‌ మళ్లీ వెనుదిరిగి చూసుకోలేదు.

రాజమౌళి ‘మగధీర’ చిత్రంలో నటించి తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్‌ ను సొంతం చేసుకుంది. తెలుగులో మాత్రమే కాకుండా తమిళం మరియు హిందీ చిత్రాల్లో కూడా నటించింది. ఈమె అత్యధికంగా తెలుగులో నటించి మెప్పించింది. టాలీవుడ్‌ యంగ్‌ స్టార్‌ హీరోలు అందరితో పాటు సీనియర్‌ హీరోలతో కూడా కాజల్‌ నటించింది. ఇప్పటికి కూడా కాజల్‌ సీనియర్‌ హీరోయిన్స్‌కు మోస్ట్‌ వాంటెడ్‌గా మారింది. తమిళంలో ఇండియన్‌ 2 చిత్రంలో నటిస్తున్న కాజల్‌ తెలుగులో చిరంజీవికి జోడీగా ఆచార్య చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే.

ఈ రెండు చిత్రాలు విడుదల అయిన తర్వాత మరిన్ని సినిమాల్లో ఈమెకు ఛాన్స్‌ వస్తాయనే నమ్మకం వ్యక్తం అవుతోంది. కాజల్‌ తెలుగులో నటించిన డార్లింగ్‌, మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌, బృందావనం చిత్రాలు ఆమె కెరీర్‌ను మరింత ఉన్నత స్థాయికి తీసుకు వెళ్లాయి. తమిళంలో సూర్యతో కలిసి నటించిన మాట్రన్‌ చిత్రం ఆమెను అక్కడ కూడా స్టార్‌ హీరోయిన్‌గా నిలబెట్టింది. ఎంతో మంది కొత్త హీరోయిన్స్‌ వచ్చినా కూడా వారికి గట్టి పోటీ ఇచ్చిన ముద్దుగుమ్మ కాజల్‌ అగర్వాల్‌ ఇంకా కూడా కొత్త హీరోయిన్స్‌కు ధీటుగా నటిస్తూనే ఉంది.

యంగ్‌ హీరోయిన్స్‌ కూడా కాజల్‌ అందం ముందు దిగదుడుపే అన్నట్లుగా ఈ అమ్మడు దూసుకు పోతుంది. 35 ఏళ్ల వయసులో కాజల్‌ అగర్వాల్‌ ఇంకా కూడా యంగ్‌ హీరోలతో రొమాన్స్‌కు రెడీ అంటోంది. ఈమద్య సౌత్‌ లో కాస్త జోరు తగ్గిన నేపథ్యంలో బాలీవుడ్‌లో రీ ఎంట్రీకి ప్రయత్నాలు చేస్తోంది. సౌత్‌ సినిమాలతో పాటు బాలీవుడ్‌లో కూడా వరుసగా చిత్రాలు చేయాలని ఈ అమ్మడు చేస్తున్న ప్రయత్నాలు సక్సెస్‌ అవుతాయని ఆమె అభిమానులు ఆశగా ఉన్నారు.

సౌత్‌ ఇండస్ట్రీలో పుష్కర కాలంగా హీరోయిన్‌గా వెలుగు వెలుగుతూనే ఉన్న కాజల్‌ అగర్వాల్‌ పుట్టిన రోజు నేడు. ఈ సందర్బంగా తెలుగు బులిటెన్‌ తరపున మరియు ఆమె ఫ్యాన్స్‌ తరపున కూడా హృదయ పూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరింత కాలం కాజల్‌ తెలుగు సినిమా పరిశ్రమలో సినిమాలు చేయాలని ఆమె ఫ్యాన్స్‌ తరపున కోరుకుంటున్నాం. మరోసారి డార్లింగ్‌ చందమామ కాజల్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు.

Share