అవును… కాజల్ అగర్వాల్ పెళ్లి చేసుకుంటోంది… వివరాలు ఇవి!

అవును చందమామ కాజల్ అగర్వాల్ పెళ్లి చేసుకుంటోంది. గత కొన్ని రోజులుగా కాజల్ పెళ్లి గురించి బోలెడన్ని రూమర్స్ వస్తూనే ఉన్నాయి. గతంలో కూడా కాజల్ పెళ్లి మీద రూమర్స్ రాగా ఆమె వాటిని ఖండించింది. అయితే ఈసారి అలా జరగకపోవడంతో అందరూ ఇదే నిజమని నమ్మారు. కొద్ది రోజుల క్రితం కాజల్ కు నిశ్చితార్ధం జరిగిందని కూడా అన్నారు. బెంగళూరులోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ లో కాజల్ నిశ్చితార్ధం జరిగిందన్నది వార్త.

అయితే ఇప్పుడు దీనిపై అధికారికంగా కాజల్ అగర్వాల్ ప్రకటించింది. అవును నేను పెళ్లి చేసుకుంటున్నాని ఒక ప్రెస్ నోట్ ను విడుదల చేసింది. ముంబైకు చెందిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లుతో కాజల్ అగర్వాల్ పెళ్లి జరగనుంది. అక్టోబర్ 30న ముంబైలో ఇరు కుటుంబాలకు దగ్గరైన బంధువుల సమక్షంలో ఈ పెళ్లి జరగనుంది.

అయితే పెళ్ళైన తర్వాత కూడా తాను సినిమాల్లో నటించడం కొనసాగిస్తానని కాజల్ క్లారిటీ ఇచ్చింది. మిమ్మల్ని ఇలానే ఎంటర్టైన్ చేస్తానని తెలిపింది కాజల్. ఇండస్ట్రీలోకి వచ్చి దశాబ్దన్నర అయినా కాజల్ ఇంకా టాప్ ఫామ్ లో కొనసాగుతోంది. మెగాస్టార్ చిరంజీవి సరసన ఆచార్యలో నటించనుంది. అలాగే భారతీయుడు 2 లో కూడా కాజల్ కీలక పాత్ర పోషిస్తోంది.