కరోనా కారణంగా చాలా మంది హీరోలు ప్రేక్షకుల ముందుకొచ్చి దాదాపు రెండేళ్లకు పైనే అవుతోంది. అయితే సీనియర్ హీరో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ ప్రేక్షకుల ముందుకొచ్చి దాదాపు నాలుగేళ్లు కావస్తోంది. ఈ నేపథ్యంలో ఆ గ్యాప్ కు డ్రేకిస్తూ కమల్ హీసన్ ‘విక్రమ్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఖైదీ మాస్టర్ వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపుని సొంతం చేసుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ లొకేష్ కనగరాజ్ ఈ మూవీని తెరకెక్కించారు.
రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై కమల్ హాసన్ నటిస్తూ నిర్మించిన ఈ మూవీ జూన్ 3న వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. విజయ్ సేతుపతి మలయాళ హీరో ఫహద్ ఫాజిల్ కీలక పాత్రల్లో నటించారు. 1986లో వచ్చిన ‘విక్రమ్’ మూవీకి లింకప్ చేస్తూ తాజా ‘విక్రమ్’ని తెరకెక్కించారు. మాసీవ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ మూవీలో హీరో కమల్ హాసన్ రా ఏజెంట్ గా కనిపించబోతున్నారు.
ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ సినిమాపై అంచనాల్ని పెంచేసింది. భారీ యాక్షన్ సన్నివేశాల నేపథ్యంలో అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కిన ఈ మూవీ కోసం తమిళ తెలుగు ప్రేక్షకుల తో పాటు పాన్ ఇండియా లెవెల్లో ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ మూవీని తెలుగులో హీరో నితిన్ ఫాదర్ ఎన్ . సుధాకర్ రెడ్డి ‘శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై అందిస్తున్నారు. సినిమా రిలీజ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ ని జోరుగా పెంచేశారు. రీసెంట్ లో ఈ మూవీలోని ఫస్ట్ సింగిల్ గా ‘మత్తుగ మత్తుగా ‘ అంటూ సాగే లిరికల్ వీడియోని విడుదల చేశారు.
చంద్ర బోస్ సాహిత్యం అందించిన ఈ పాటని సంగీత దర్శకుడు అనిరుధ్ తో కలిసి కమల్ ఆలపించారు. ఊర మాసీవ్ స్టెప్పులతో సాగిన ఈ పాట థియేటర్లలో కమల్ ఫ్యాన్స్ చేత స్టెప్పులేయించేలా వుంది. ఇదిలా వుంటే ఈ మూవీకి సెన్సార్ టీమ్ షాకిచ్చిందని తెలిసింది. అయితే ఇటీవల సెన్సార్ చేసిన టీమ్ ఈ మూవీకి బిగ్ షాక్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.
ఇటీవలే ఈ మూవీ సెన్సార్ ఫార్మాలిటీస్ ని పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే సెన్సార్ ఎన్ని కట్స్ విధించిందన్న విషయం తాజాగా బయటికి వచ్చింది. ఈ చిత్రానికి మొత్తం 13 కట్స్ విధించారట. అంతే కాకుండా కొన్ని అసభ్య పదాలని కూడా తొలగించారని కొన్ని వైల్డ్ సీన్ లని కూడా కట్ చేసినట్టుగా తెలిసింది. ఇది విక్రమ్ టీమ్ కు బిగ్ షాక్ అని అంటున్నారు. ఇదిలా వుంటే ఈ చిత్రంలోని కీలక అతిథి పాత్రలో హీరో సూర్య నటించిన విషయం తెలిసిందే.