ఆ హీరోయిన్‌ రియల్ బాంబ్‌ అంటూ వర్మ కామెంట్స్‌

వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ ఎప్పుడు ఏది చేసినా కూడా ప్రత్యేకంగా ఉంటుంది అనడంలో సందేహం లేదు. ఆయన ప్రతి ట్వీట్ కూడా ఏదో వైవిధ్యంను కలిగి ఉంటుంది. ఈ సారి వర్మ చేసిన ట్వీట్ బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్ కంగనా రనౌత్‌ గురించి. ఆమె ఒక సినిమా వర్కింగ్‌ స్టిల్ ను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ఆ ఫొటో అందరి దృష్టిని ఆకర్షించింది. ఒక పోరాట యోదురాలిగా కంగనా ఆ ఫొటోలో కనిపిస్తుంది. అద్బుతమైన మేకప్ తో పాటు వావ్‌ అనిపించేలా ఎక్స్‌ ప్రెషన్స్‌ తో కంగనా కిల్లింగ్‌ లుక్‌ తో అలరించింది.

కంగనా లుక్స్‌ పై రామ్‌ గోపాల్ వర్మ స్పందించాడు. ట్విట్టర్‌ ద్వారా ఆయన కంగనాపై ప్రశంసలు కురిపించాడు. నేను ఇప్పటి వరకు ఎంతో మంది హీరోయిన్‌ లను చూశాను. కాని ఇంత క్లోజ్ గా ఉన్న రియాలిటీ ఫొటోను చూసి ఆశ్చర్యపోయాను. నేను ఒక ప్రొఫెషనల్‌ డైరెక్టర్‌ గా చెబుతున్నాను నా కెరీర్‌ మొత్తంలో ఇలాంటి బెస్ట్‌ క్లోజప్ చూడలేదు అంటూ కాస్త అతిశయోక్తి వ్యాఖ్యలు చేశాడు. నువ్వు నిజంగా న్యూక్లియర్‌ బాంబు వు అంటూ ప్రశంసలు కురిపించాడు. కంగనాకు వర్మ నుండి ఇలాంటి ప్రశంస రావడం కామన్‌. కాని ఈసారి కాస్త అతిశయోక్తి ఎక్కువ అయ్యింది అన్నట్లుగా ఆయన వ్యాఖ్యలు చేశాడు. మరి కంగనా దీనికి ఎలా రియాక్ట్‌ అవ్వబోతుందో చూడాలి.