నగ్మ కామెంట్స్‌కు కంగనా టీం స్ట్రాంగ్‌ రియాక్షన్‌

ఈమద్య కాలంలో కంగనా బాలీవుడ్‌ సినీ ప్రముఖులపై చేస్తున్న వ్యాఖ్యలను వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. కరణ్‌ జోహార్‌.. మహేష్‌ భట్‌లతో పాటు తాజాగా అనురాగ్‌ కశ్యప్‌ను కూడా కంగనా టార్గెట్‌ చేసింది. అనురాగ్‌ కశ్యప్‌ను మినీ మహేష్‌ భట్‌ అంటూ కంగనా సంభోదించడం ప్రస్తుతం టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా నిలిచింది. కంగనా అలా ఎందుకు అన్నదో నాకు అర్థం కావడం లేదు. నేను ఏమైనా తప్పు చేస్తే క్షమాపణ అడిగేందుకు సిద్దంగా ఉన్నాను అంటూ అనురాగ్‌ కశ్యప్‌ అన్నాడు. ఈ విషయమై నగ్మ స్పందిస్తూ కంగనాపై అసహనం వ్యక్తం చేసింది.

కంగనా కెరీర్‌ మొత్తం కూడా నెపొటిజం పై ఆధారపడి ముందుకు వెళ్తుంది. ఆమెకు మొదటి నుండి ఎవరి సపోర్ట్‌ లేకుండానే ఈ స్థాయికి చేరిందా. ఆమెకు మొదటి ఆఫర్‌ ఇచ్చిన మహేష్‌ భట్‌ నెపొటిజంతోనే ఇచ్చాడా అంటూ నగ్న ప్రశ్నించింది. ఆ తర్వాత కూడా నీకు చాలా ఆఫర్లు వచ్చాయి. అవన్నీ కూడా నీకు ఎలా వచ్చాయో చెప్పగలవా అంటూ నగ్మ కాస్త సీరియస్‌గానే ప్రశ్నించడంతో కంగనా టీం కాస్త ఘాటుగా స్పందించారు.

ఆదిత్యా పంచోలీ కంగనాకు ఆఫర్లు వచ్చేలా చేసిన మాట వాస్తవమే. కాని ఆయన వల్ల కంగనా ఎంతగా ఇబ్బందులు పడినదో గతంలో పలు సందర్బాల్లో చెప్పింది. ఆడిషన్స్‌ సమయంలో కంగనాపై ఆయన చేయి చేసుకున్నాడు. కంగనా కెరీర్‌ మొదలు పెట్టిన సమయంలో మహేష్‌ భట్‌ ట్యాలెంట్‌ను చూసి ఛాన్స్‌ ఇచ్చాడు. అప్పట్లో నెపొటిజం ఇంతగా ఉంటే ఖచ్చితంగా తను ఇంత పెద్ద హీరోయిన్‌ స్థాయికి వచ్చేది కాదు అంటూ కంగనా టీం సోషల్‌ మీడియా ద్వారా నగ్మకు స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇవ్వడం జరిగింది.