రాజమౌళిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కంగనా

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ గా కంగనా రనౌత్ కు పేరుంది. ఈ గ్లామరస్ నటి చుట్టూ బోలెడన్ని వివాదాలు ఉన్నాయి. ఎప్పటికప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో కంగనా ముందుంటుంది. అవతల ఎంత పెద్ద వ్యక్తి ఉన్నా కూడా ఏమాత్రం తడబడకుండా ఆ వ్యక్తిపై సంచలన వ్యాఖ్యలు చేయగల దిట్ట.

అలాంటి కంగనా మన దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. “ఎస్ ఎస్ రాజమౌళి విషయంలో గొప్పతనం తన సక్సెస్ రేట్ కాదు, అతని వినయం మరియు ధర్మం. నేను నా కుటుంబంతో కలిసి ఆర్ ఆర్ ఆర్ చూస్తున్నా. మరి మీరు?” అని ట్వీట్ చేసింది.

కంగనా రనౌత్ నుండి అలాంటి పాజిటివ్ ట్వీట్ రావడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. మరోవైపు ఆర్ ఆర్ ఆర్ హిందీ మార్కెట్ లో దూసుకుపోతోంది. అక్కడ సూపర్ పాజిటివ్ టాక్ ఉంది. ఇప్పటికే 100 కోట్ల క్లబ్ లో చేరిపోయింది ఆర్ ఆర్ ఆర్.