ప్రస్తుతం కంగనా రనౌత్ వర్సెస్ మహారాష్ట్ర ప్రభుత్వంగా మారిపోయాయి అక్కడి పరిస్థితులు. పోలీసులు, శివసేన, మీడియా.. అందరూ ఆమెకు వ్యతిరేకంగా మారిన పరిస్థితుల్లో బీజేపీ కొండంత అండగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె బీజేపీకి మద్దతుగా.. శివసేనకు వ్యతిరేకంగా మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ట్రోలింగ్ కు గురవుతున్నాయి. తాను రాజకీయాల విషయంలో అమాయకురాలినని అందుకే గత ఎన్నికల్లో గత్యంతరం లేని పరిస్థితుల్లో శివసేనకు ఓటు వేశానని ఇటివల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. కంగనా చెప్తోంది తప్పు అని కమలేశ్ సుతార్ అనే జర్నలిస్టు నిరూపిస్తున్నారు.
‘‘మహారాష్ట్ర సీఈవో డాటా ప్రకారం.. కంగనా బాంద్రా వెస్ట్, లోక్‌సభకు నార్త్- సెంట్రల్ నుంచి ఓటు వేశారు. అసెంబ్లీ ఎన్నికలకు బాంద్రా వెస్ట్ అభ్యర్థి బీజేపీ వ్యక్తి ఆశిశ్ షేలార్. లోక్‌సభ అభ్యర్ధి ముంబై నార్త్ సెంట్రల్ నుంచి బీజేపీ అభ్యర్థి పూనమ్ మహాజన్ పోటీ చేసారు. ఈ రెండు ఎన్నికల్లో బీజేపీ-శివసేన కలిసే పోటీ చేశాయి. కానీ.. రెండింటిలోనూ బీజేపీ అభ్యర్థులే పోటీ చేశారు. కాబట్టి అక్కడ శివసేన అభ్యర్థులు పోటీ చేసే అవకాశం లేదు. మరి కంగనా శివసేనకు ఓటు ఎలా వేస్తారు’ అని కమలేశ్ అంటున్నారు.
దీంతో కంగనా చెప్పేది తప్పని తేలింది. అయితే కంగనా వాదన మరోలా ఉంది. తాను ఖార్ వెస్ట్‌లోని బీపీఎం స్కూలులో శివసేనకు ఓటు వేశానని అంటోంది. మీడియా వర్గాలు తప్పుగా నివేదిక ఇవ్వడం సరికాదని అంటోంది.