స్టార్ కపుల్ ఇంట మరో వారసుడొచ్చాడు..!

బాలీవుడ్ క్రేజీ కపుల్ సైఫ్ ఆలి ఖాన్, కరీనా కపూర్ ల ఇంట మరో వారసుడు వచ్చాడు. ఆల్రెడీ వీరికి ఇంతకుముందు కూడా మగ సంతానమే అందింది. కరీనా, సైఫ్ ల మొదటి వారసుడు తైమూర్ అందరికి తెలుసు. ఇక ఇప్పుడు వీరిద్దరి రెండో సంతానంగా కూడా బాబు పుట్టినట్టు సమాచారం. శనివారం రాత్రి ముంబైలోని బ్రిడ్జ్ క్యాండీ హాస్పిటల్ లో జాయిన్ అవగా ఆదివారం ఉదయం పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చినట్టు తెలుస్తుంది.

సైఫ్, కరీనా తన కొత్త వారసుడిని వారి లైఫ్ లోకి ఆహ్వానించారు. 2016లో తైమూర్ పుట్టాడు. ఐదేళ్ల తైమూర్ ఇప్పుడు అన్న అయ్యాడన్నమాట. పెళ్లి తర్వాత కూడా అటు సైఫ్, ఇటు కరీనా ఇద్దరు సినిమాలతో బిజీగా ఉన్నారు. కరీనా కపూర్ కరణ్ జోహార్ ప్రాజెక్ట్ లో నటిస్తుంది. సైఫ్ ఆలి ఖాన్ ఓం రౌత్ డైరక్షన్ లో ప్రభాస్ లీడ్ రోల్ లో వస్తున్న ఆదిపురుష్ సినిమాలో రావణుడి పాత్రలో నటిస్తున్నాడు.