బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘కార్తీకదీపం’ సీరియల్ 701 ఎపిసోడ్లను పూర్తి చేసుకుని.. 702 ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది. ఈ ఎపిసోడ్ హైలైట్స్ మీకోసం. తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న‘కార్తీకదీపం’ సీరియల్ నేటి (జనవరి 11) రాత్రి ఎపిసోడ్లో ఏం జరగనుందో ‘సమయం’లో మీకోసం ముందుగానే.
గత ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
మౌనిత ఆవేశంగా వెళ్లిపోతుంటే.. కార్తీక్ ఆపుతాడు. ‘హిమకి నీ చేతుల మీద ఫ్రైజ్ ఇస్తే బాగుండేది’ అంటూ మాటవరకు మాట కలుపుతాడు. ‘ఇప్పుడు మాత్రం ఏమైంది? ఇంకా బాగుందిగా.. హిమకు అమ్మానాన్నలుగా ఆ వంటలక్కా నువ్వు కలిసి బాగానే ఫ్రైజ్ ఇచ్చారుగా.. మీ అమ్మగారు ఎంత తెలియవైనోళ్లో తెలుసా? మీరు ఫ్రైజ్ ఇస్తున్నప్పుడు ఫొటోస్ తీశారు. రేపు కోర్టులో అవి చూపిస్తే నీకు విడాకులు ఇస్తారా?.. అయినా నువ్వు ఎలా పోతే నాకెందుకు?’ అంటూ ఓవర్ యాక్షన్ చేస్తూ వెళ్లిపోతుంది.
విడాకులా? హిమ షాక్!
విడాకులు ఇప్పించే లాయర్ కార్తీక్‌ని పలకరిస్తాడు. ‘మీరు స్కూల్ దగ్గర ఉన్నారేంటీ? అనగానే నా తమ్ముడు కూతురికి రన్నింగ్‌లో ఫస్ట్ ఫ్రైజ్ వచ్చింది. అందుకే నేను హేమమాళినితో కలిసి వచ్చాను’ అంటాడు. ఇంతలో హిమ కార్తీక్ దగ్గరకు పరుగున వస్తూ ఉంటుంది. కార్తీక్‌ని లాయర్.. ‘ఎలా ఉన్నారు?’ అని పలకరించగానే.. ‘విడాకులు ఇప్పించేదాకా? ఎలా బాగుంటాను?’ అని అడుగుతాడు. ఆ మాట హిమ విని షాక్ అయ్యి కొంత దూరంగా ఆగిపోతుంది.
అంటే అమ్మ బతికే ఉందా?
‘విడాకులు వచ్చేస్తాయి సార్.. మీరు టెన్షన్ పడకండి. వారం రోజుల్లో మీకు విడాకులు ఇప్పించే పూచీ నాది’ అంటూ లాయర్. హిమ ఆలోచనలో పడుతుంది. ‘విడాకులా? అమ్మ చనిపోయింది కదా? విడాకులు రావడం ఏంటీ? అంటే మా అమ్మ బతికే ఉందా?’ అని ఆలోచించుకుంటుంది. ‘ముందు ఆ పని చూడండి’ అని కార్తీక్ లాయర్‌తో చెప్పడం చూసి.. బాధగా అక్కడ నుంచి వెళ్లిపోతుంది.
సౌందర్య ఫైర్!
‘సరే’ సార్ అని లాయర్ కార్తీక్ దగ్గర నుంచి వెళ్లగానే.. సౌందర్య దీపను తీసుకొచ్చి.. ‘ఒక్కనిమిషం.. ఉత్తమ భర్త కాలేని ఉత్తమ నాన్నా’ అంటూ వెటకారం ఆడుతుంది. ‘నీ ఉత్తమ భార్య నీతో మాట్లాడాలట. మనం కాసేపు అలా బయటికి వెళ్తాం’ అంటూ కార్తీక్‌కి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ‘ఎక్కవే కారు.. అలా చూస్తున్నావ్? ఇంకెన్నాళ్లు అలాగే భయపడతావ్?’ అంటూ అరుస్తుంది. దాంతో దీప ఎక్కి కూర్చుంటుంది. కార్తీక్ కారు తీస్తాడు.
సినిమాల్లో చూస్తాం కదా..?
హిమ బాధగా ఓ పక్కకు కూర్చుంటుంది. సౌర్య వచ్చి.. ‘ఇక్కడున్నావా?’ అంటూ పక్కనే కూర్చుంటుంది. ‘సౌర్య నీకు నాకంటే ఎక్కువ తెలుసు కదా? మరి విడాకులు చనిపోయిన వాళ్లకు ఇస్తారా?’ అని అడుగుతుంది హిమ అమాయకంగా.. ‘లేదు.. మనం ఎన్ని సినిమాల్లో చూస్తాం కదా.. భార్య భర్తలు ఇద్దరూ ఎదురెదురుగా నిలబడి ఉంటారుగా.. ‘మొన్న మనమిద్దరం చూశాం కదా? రోడ్డు మీద భార్య భర్త గొడవ పడింది. అలాగే ఉంటుంది.. అయినా నీకు ఆ డౌట్ ఎందుకువచ్చింది’ అని అడుగుతుంది సౌర్య.
సౌర్య మనసులో ఆవేదన!
‘అదీ మా డాడీ ఎవరితోనే నాకు విడాకులు తప్పకుండా కావాలని చెబుతుంటే విన్నాను. విడాకులు వచ్చేస్తాయట’ అని హిమ చెప్పగానే.. సౌర్య మనసులో ‘నాన్న విడాకులు ఇచ్చేది మా అమ్మకే హిమా.. అసలు నువ్వు ఎవరో నాకు అర్థం కావట్లేదు. ఈ విషయం నీకు చెప్పాలో లేదో కూడా తెలియట్లేదు’ అని ఆలోచించుకుంటుంది బాధగా..
photo courtesy star maa and hotstar
మీ డాడీనే అడుగు!
‘ఏంటీ నువ్వేం మాట్లాడవ్? మా అమ్మ చనిపోయింది కదా? మరి విడాకులు ఎలా ఇస్తారు?’ అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటుంది హిమ. వెంటనే సౌర్య.. ‘నన్ను అడిగితే నేనే ఎలా చెప్పాలి? మీ అమ్మ చనిపోయిందని మీ డాడీ చెప్పారు కదా? మరి చనిపోయిన అమ్మకి విడాకులు ఎలా ఇస్తావ్ డాడీ? అని మీ డాడీనే అడుగు’ అని పంపిస్తుంది. దాంతో హిమ అక్కడ నుంచి ఆవేశంగా బయలుదేరుతుంది. సౌర్య ఆలోచనలో పడుతుంది.
కార్తీక్ వెటకారం!
సీన్ కట్ చేస్తే.. దీప, సౌందర్య, కార్తీక్‌లు ఒక పార్క్‌లో నిలబడతారు. కార్తీక్ నవ్వుతాడు. ‘ఎందుకు నవ్వుతున్నావో తెలుసుకోవచ్చా?’ అని సౌందర్య అడగగానే.. ‘దీని(దీప)కి ఎవరి పట్టుకుంటే పని అయిపోతుందో.. బాగా తెలుసు.. అందుకే నిన్ను తీసుకుని రాయబేరానికి వచ్చింది’ అంటూ వెటకారంగా. దీప ధీనంగా చూస్తుంది.
ఏ మాత్రం కరగని కార్తీక్
‘డాక్టర్ బాబూ.. మనం విడిపోకుండా ఇలాగే ఉండిపోదాం. నా ఆశలని చంపెయ్యొద్దు.. ఎప్పటికైనా మీకు నిజం తెలుస్తుందనే ఆశతో బతుకుతున్నాను’ అని దీప.. ‘దాని ఉసురు పోసుకోకురా’ అని సౌందర్య చాలా సేపు చాలా రకాలుగా చెప్పడానికి ప్రయత్నిస్తారు.
దాన్ని డ్రాప్ చేసి రా మమ్మీ!
‘విడాకులు వచ్చి తీరాలి.. దీనిలో ఏ మార్పు లేదు. విడాకులు ఇచ్చేది నా మనశ్శాంతి కోసం. అనవసరంగా మన మధ్య గొడవలు వద్దు’ అని కారు కీస్ సౌందర్య చేతికి ఇచ్చి.. ‘మధ్యలో వదిలేసి వెళ్లాడని మీరు నన్ను అడకుండా..’ దాన్ని(దీపని) స్కూల్ దగ్గర డ్రాప్ చేసి రా మమ్మీ’ అని చెప్పి అక్కడ నుంచి పక్కకు వెళ్లిపోతాడు. దీప బాధపడుతూ ఉంటే సౌందర్య ఓదారుస్తుంది.
కమింగ్ అప్‌లో..
హిమ చేతులు కట్టుకుని.. కోపంగా.. కార్తీక్ ఆఫీస్ చైర్లో కూర్చుంటుంది కార్తీక్ అక్కడకు వెళ్లే సరికి. హిమని చూసి షాక్ అవుతాడు కార్తీక్. ‘అమ్మా హిమా.. మళ్లీ పెళ్లి చేసుకోమని చెప్పడానికి వచ్చావా?’ అంటాడు కాస్త కోపంగా కార్తీక్. ‘అమ్మకి విడాకులు ఇవ్వదని చెప్పడానికి వచ్చాను డాడీ’ అంటుంది హిమ. కార్తీక్ షాక్‌తో.. ‘ఏం అన్నావమ్మా?’ అనగానే.. హిమ మళ్లీ మాట్లాడుతుంది. అమ్మంటే దీపే కదా డాడీ? నువ్వు అమ్మకు విడాకులు ఇవ్వకు డాడీ’ అంటుంది. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం! కార్తీకదీపం కొనసాగుతోంది.