Karthika Deepam Serial 21st January Episode Online 2020

బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘కార్తీకదీపం’ సీరియల్ 709 ఎపిసోడ్‌లను పూర్తి చేసుకుని.. 710 ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది. ఈ ఎపిసోడ్‌ హైలైట్స్ మీకోసం. తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న‘కార్తీకదీపం’ సీరియల్ నేటి (జనవరి 21) రాత్రి ఎపిసోడ్‌లో ఏం జరగనుందో ‘సమయం’లో మీకోసం ముందుగానే.

గత ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే…

హిమ విడాకుల గురించి హోటల్‌లో నిలదియ్యడంతో.. కార్తీక్ హిమని తినకుండా తీసుకొచ్చేస్తాడు. మళ్లీ జ్వరం రావడంతో ఇంటికి ఎత్తుకుని తీసుకొస్తాడు. హిమ తల మీద చెయ్య వేసిన ఆనందరావు.. ‘మళ్లీ జ్వరమా?’ అంటాడు కంగారుగా.. ‘దిగులు..’ అంటాడు కార్తీక్. ‘ఏంటమ్మా నా వడిలో పడుకుంటావా? రా..’ అంటూ హిమని ఒడిలో పడుకోబెట్టుకున్న సౌందర్య.. ‘ఏమైందే? చెప్పమ్మా.. ఏమైంది?’ అంటూ ఆరా తియ్యడంతో ‘మళ్లీ వంటలక్క గురించి మొదలుపెడతారేమోనని’ కార్తీక్ కంగారు పడతాడు. ‘ఎందుకు పిలుస్తావ్ మమ్మీ? వదిలెయ్ మీతో గొడవ పడే ఓపిక నాకు లేదు..’ అంటూ హిమని భుజాన్న వేసుకుని పైకి తీసుకుని వెళ్లిపోతాడు కార్తీక్.

ఒకేఒక్కటి అడుగుతాను డాడీ..

హిమని పైకి తీసుకుని వెళ్లి.. బెడ్ మీద పడుకోబెట్టి.. దుప్పటి కప్పి ‘పడుకోమ్మా’ అంటూ బయటికి వెళ్తుంటాడు కార్తీక్. అయితే కార్తీక్ చెయ్యి పట్టుకుని ఆపిన హిమ.. ‘ఏదైనా అడుగుతానని వెళ్లిపోతున్నావా డాడీ?’ అంటుంది పైకి కష్టంగా లేస్తూ.. ‘అయ్యో లేదురా..’ అంటూ కార్తీక్ నచ్చజెబుతుంటే.. ‘ఒకేఒక్కటి అడుగుతాను డాడీ.. అమ్మకు విడాకులు ఇవ్వద్దు డాడీ ప్లీజ్..’ అంటుంది హిమ ఏడుపు ముఖం పెట్టి బాధగా.. ‘అమ్మ ఎక్కడుందిరా.. నన్ను అలా బాధపెట్టకు రా హిమా’ అంటూ కార్తీక్ వెనక్కి తిరిగి బాధపడుతుంటే.. ఇంతలో సౌందర్య వచ్చి.. ‘ఎలా ఉందిరా?’ అంటుంది.

కార్తీక్ ఆవేదన.. సౌందర్య ప్రేమ..

‘తల పగిలిపోతుంది మమ్మీ. హిమ రోజు రోజుకీ మెంటల్‌గా ఫిజికల్‌గా వీక్ అయిపోతుంది. నేనొక డాక్టర్‌ని అయ్యుండి నేనే చాలా టెన్షన్ పడుతున్నాను మమ్మీ..’ అంటూ బాధపడుతుంటాడు కార్తీక్. కొడుకు బాధని చూడలేక సౌందర్య.. కార్తీక్ రెండు చేతులు పట్టుకుని.. ‘గుండెకు ఏమైదో చెప్పగలవు.. ఆ గుండెల్లో ఏం ఉందో నువ్వు ఎలా చెప్పగలవురా? అయినా ఏంట్రా పెద్దోడా ఇది చిన్న పిల్లోడిలాగా’ అంటూ కార్తీక్ నుదిటి మీ ముద్దు పెడుతుంది సౌందర్య. ‘నాన్నమ్మా నువ్వు ఎప్పుడు మా డాడీతో ఇంత ప్రేమగా మాట్లాడొచ్చుకదా?’ అంటూనే.. ‘ఇలా మాట్లాడితే అసలు డాడీకి పెళ్లి చెయ్యాలనుకునేదాన్నే కాదు..’ అనుకుంటుంది హిమ మనసులో..

నువ్వేంటే రౌడీ ఈ టైమ్‌లో..?

హిమని కూడా దగ్గరకు తీసుకుని ముద్దాడిన సౌందర్య.. కార్తీక్‌ని, హిమని ప్రేమగా పట్టుకుని ఉంటుంది. అయితే అప్పటికే అక్కడికి వచ్చిన దీప, సౌర్యలు ఆ సీన్ చూస్తూ ఉంటారు. ‘మేము ఉన్నప్పుడు డాక్టర్ బాబుని తిడుతుంది కానీ.. మేము లేనప్పుడు హిమతో ఉన్నప్పుడు డాక్టర్ బాబుకు బాగానే ముద్దులుపెడుతుంది ఈ నాన్నమ్మ’ అనుకుంటుంది సౌర్య. దీప, సౌర్యలను చూసిన హిమ.. చాలా ప్రేమగా ఆహ్వానిస్తుంది. కార్తీక్ కోపంగా.. ‘నువ్వేంటే రౌడీ ఈ టైమ్‌లో’ అంటాడు సౌర్యను. ‘నేను వంటలక్కని రమ్మని ఫోన్ చేశాను డాడీ నాకు వంట్లో బాలేదు.. చూడటానికి రమ్మన్నాను..’ అంటుంది హిమ. దాంతో కార్తీక్ గదిలోంచి బయటికి వెళ్లిపోతాడు.

మౌనిత ఊహలు..

‘జరిగి తీరుతుంది.. జరిగి తీరుతుంది..’ అంటూ మౌనిత ప్రియమణిని పట్టుకుని ఆవేశంగా ఊపేస్తుంది. ‘అమ్మా.. అమ్మా’ అనడంతో ప్రియమణిని వదిలేసిన మౌనిత.. ‘కార్తీక్ దీపకు విడాకులు ఇవ్వడం ఖాయం. కార్తీక్ చాలా పంతంలో ఉన్నాడు. ఈ సారి విడాకుల తప్పకుండా వస్తాయి..’ అంటూ అరుస్తుంది. అయితే ప్రియమణి మాత్రం ఎప్పటిలాగే.. ‘కార్తీక్ అయ్య కూతురు మీద ప్రేమతో విడాకులు ఇవ్వడం మానేస్తాడో.. లేక దీప మీద కోపంతో విడాకులు ఇస్తాడో చూద్దాం లేమ్మా’ అని అక్కడ నుంచి వెళ్లిపోతుంది.

కామెడీ సీన్..

మాలతితో ఆనందరావు సంబరపడిపోతూ.. ‘ఎవరొచ్చారో చూశావ్‌గా అన్ని వంటకాలు సిద్ధం చెయ్యి.. ఆ పిచ్చి సన్నాసి(కార్తీక్) ఏం చేస్తాడులే.. సౌర్య, హిమల ముందు వాడు దీపని ఏం అనలేడు’ అంటూ మాట్లాడుతుంటాడు. అంతా వింటాడు కార్తీక్. ఇంతలో ఆనందరావుకి పొరమారుతుంది. దగ్గుతుంటే వాటర్ తీసుకొచ్చి ఇస్తాడు కార్తీక్. ‘నువ్వు నా ఎదురుగానే ఉన్నావ్‌గా మాలతీ ఈ వాటర్ ఎవరు ఇచ్చారు?’ అంటాడు ఆనందరావు కార్తీక్‌ని గమనించుకోకుండా. మాలతీ వెర్రి ముఖం వేస్తుంది. నేనే తండ్రీ అన్న కార్తీక్ మాటలు విని కంగుతిన్న ఆనందరావు అనుమానంగా.. ‘మొత్తం వినేశావా?’ అంటాడు. ‘ఆల్ మోస్ట్’ అంటాడు కార్తీక్ కోపంగా.. ఆ సీన్ భలే కామెడీ ఉంటుంది.

కార్తీక్ విడాకులు తీసుకుంటాడు..

‘హిమ అడిగితే ఏమైనా చేస్తాడు. విడాకుల గురించి గట్టిగా అడిగితే కాదనకుండా చేస్తాడు. అప్పుడు ఏం చెయ్యాలి? అసలు ఏం జరుగుతుందో చాలా టెన్షన్‌గా ఉంది’ అనుకుంటూ మౌనిత ఏవో రెండు చిట్టీలు రాసి, ఒక బాక్స్‌లో వేసి ప్రియమణిని పిలుస్తుంది. ప్రియమణి తీస్తున్నంత సేపు మౌనిత టెన్షన్ పడుతూ ఉంటుంది. ‘కార్తీక్ విడాకులు తీసుకుంటాడు’ అని వస్తుంది. చాలా హ్యాపీగా ఫీల్ అయన మౌనితని చూసిన ప్రియమణి.. ‘నాకు మీ లక్ మీద అంత నమ్మకం లేదమ్మా.. సరిగానే వచ్చిందంటారా?’ అంటుంది.

ఇదేంటమ్మా?

‘మరీ అంతగా డౌట్ ఉంటే.. మరో సారి తీసి చూడవే’ అంటుంది మౌనిత కాన్ఫిడెంట్‌గా. మరోసారి కూడా ‘కార్తీక్ విడాకులు తీసుకుంటాడు’అని వస్తుంది. అనుమానం వచ్చిన ప్రియమణి రెండు పేపర్స్ చెక్ చేస్తుంది. రెండింటిలోనూ ‘కార్తీక్ విడాకులు తీసుకుంటాడు’ అనే ఉంటుంది. ఇదేంటమ్మా అని ప్రియమణి ప్రశ్నిస్తే.. ‘రెండో సారి కూడా ఒకే సమాధానం రావాలి కదా’ అంటూ నవ్వుతుంది మౌనిత.

అంతా కలిసి కిందకు..

‘దీప ఇక్కడికి రావడం ఏంటీ? నా వెనుక ఏదైనా జరుగుతుందా? ఆ వంటలక్క హిమ జ్వరం వంక పెట్టుకుని వచ్చినట్లుంది. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? ఆ సౌర్యకి ఆ వంటలక్క మొగుడ్ని నేనే అని తెలిస్తే ఇంకా ప్రమాదం’ అంటూ కంగారు పడుతూ ఉంటాడు. అప్పటికే సౌర్య సౌందర్యని నేను కిందకి వెళ్లొచ్చా అని అడగడంతో అందరినీ తీసుకుని కిందకు దిగుతుంది సౌందర్య. కార్తీక్ కాస్త అసహనంగా ఫీల్ అవుతాడు. ఆదిత్య వచ్చి ‘వది.. వంటలక్కా ఎలా ఉన్నావ్?’ అని పలకరిస్తాడు. బాగున్నాను అంటుంది దీప.

కమింగ్ అప్‌లో…

కార్తీక్, సౌర్య, ఆనందరావు, సౌందర్య, మాలతి, ఆదిత్య అందరి ముందు హిమ వంటలక్కను పట్టుకుని.. ‘నువ్వైనా చెప్పు వంటలక్కా.. మా అమ్మకు విడాకులు ఇవ్వదన్న మా డాడీకి చెప్పు వంటలక్కా’ అంటూ ఏడుస్తుంది. కార్తీక్ ఆవేశంగా హిమా.. అని అరుస్తాడు. దగ్గరకు వెళ్లి హిమని వంటలక్క నుంచి తీసుకొచ్చి సోపాలో కూర్చోబెట్టి.. ‘లేని మనిషికి, చచ్చిపోయిన మనిషికి విడాకులు ఏంటమ్మా.. మీ అమ్మ లేదు. అయినా సరే నీకు మాటిస్తున్నాను. ఇక ఎప్పుడూ విడాకులు మాటే ఎత్తును’ అంటూ హిమ చేతిలో చెయ్యి వేస్తాడు కార్తీక్. అక్కడే ఉన్న దీప, సౌర్యలతో పాటూ అందరూ ఆ మాటలకు సంతోషిస్తారు. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం! కార్తీకదీపం కొనసాగుతోంది.