Karthika Deepam Serial 22nd January Episode Online 2020

బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘కార్తీకదీపం’ సీరియల్ 710 ఎపిసోడ్‌లను పూర్తి చేసుకుని.. 711 ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది. ఈ ఎపిసోడ్‌ హైలైట్స్ మీకోసం. తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న‘కార్తీకదీపం’ సీరియల్ నేటి (జనవరి 22) రాత్రి ఎపిసోడ్‌లో ఏం జరగనుందో ‘సమయం’లో మీకోసం ముందుగానే.

గత ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే…

హిమను చూడటానికి ఇంటికి వస్తారు సౌర్య,దీపలు. కార్తీక్ రగిలిపోతూ ఉంటాడు.‘దీప ఇక్కడికి రావడం ఏంటీ? నా వెనుక ఏదైనా జరుగుతుందా? ఆ వంటలక్క హిమ జ్వరం వంక పెట్టుకుని వచ్చినట్లుంది. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? ఆ సౌర్యకి ఆ వంటలక్క మొగుడ్ని నేనే అని తెలిస్తే ఇంకా ప్రమాదం’ అంటూ కంగారు పడుతూ ఉంటాడు. అప్పటికే సౌర్య సౌందర్యని ‘నేను కిందకి వెళ్లొచ్చా?’ అని అడగడంతో అందరినీ తీసుకుని కిందకు దిగుతుంది సౌందర్య. కార్తీక్ కాస్త అసహనంగా ఫీల్ అవుతాడు. ఆదిత్య వచ్చి ‘వది.. వంటలక్కా ఎలా ఉన్నావ్?’ అని పలకరిస్తాడు. ‘బాగున్నాను’ అంటుంది దీప.

ఎక్కడికే బయలుదేరావ్?

మాలతీకి ఆనందరావు.. ‘దీప వచ్చింది కాబట్టి అన్ని వంటలు అదిరిపోవాలి’ అంటూ చెబుతాడు. అదంతా విన్న కార్తీక్.. ‘మాలతీ నువ్వు పొద్దున్నుంచీ చేసి చేసి అలసిపోయావ్.. వెళ్లిపో.. వెళ్లు మాలతీ.. బయలుదేరు’ అంటూ పదేపదే గట్టిగా అనడంతో చేసేది లేక వెళ్లేందుకు సిద్ధమవుతుంది. వెళ్లిపోతున్న మాలతీని చూసి.. ‘ఎక్కడికే బయలుదేరావ్? వంట చెయ్యి. ఈ రోజు వంటలక్క, సౌర్య కూడా ఇక్కడే తింటారు’ అన్న సౌందర్య మాటలు విన్న మాలతీ.. టెన్షన్‌గా కార్తీక్ వైపు చూస్తూ ఉంటుంది. కార్తీక్ పేపర్
పాపం వంటలక్కని ఎందుకు?

‘వాడివైపు చూస్తున్నావ్ వాడు చేస్తాడా వంటా?’ అంటుంది సౌందర్య మాలతీని. ఆనందరావు కూడా కార్తీక్‌నే చూడ్డంతో.. ‘మీ ఇద్దరికీ ఏమైంది? కార్తీక్ చేస్తానన్నాడు వంటా? నువ్వు చెయ్యనంటే చెప్పు. వంటలక్కే వండిపెట్టేస్తుంది.. మేమంతా లొట్టలేసుకుంటూ తింటాం’ అంటూ సౌందర్య అనడంతో ఆదిత్య, ఆనందరావులు సై అంటారు. దాంతో కార్తీక్ కలుగజేసుకుని.. ‘మీరాపుతారా? వంటగింట అని పాపం వంటలక్కని ఎందుకు ఇబ్బంది పెడతాడు. పొద్దున్నే లేస్తే అదే పనిలో ఉంటుంది. తనకేమైనా ఇల్లు వాకిలీ లేదా? ఇక్కడే ఉండిపోవడానికి వచ్చిందా?’ అంటాడు కార్తీక్ వెటకారంగా..

చచ్చింది గొర్రె..

‘అదేంటి డాక్టర్ బాబు అలా అంటారు? సౌర్యని చదివిస్తున్నారు మీరు మీ కుంటుంబం ఒకటి నా కుటుంబం ఒకటీనా? మీ ఇల్లు ఒకటి నా ఇల్లు ఒకటీనా? మీ హిమ వేరు నా సౌర్య వేరూనా? నేనుంటా.. అందరికీ కమ్మగా వండిపెడతాను. అందరూ కడుపు నిండా తిన్నాకే వెళ్తాను’ అన్న దీప మాటలకు.. ‘చచ్చింది గొర్రె’అని ఆనందరావు నవ్వుతుంటే, ‘శభాష్ బంగారం. భలే బుక్ చేశావ్..’ అని సౌందర్యలు సైగలు చేస్తుంది.

అయ్యో నేనేం అంటాను..

ఇంతలో ఆదిత్య ఆనందంతో వ..వంటలక్కా.. వండిపెట్టు ప్లీజ్.. కమ్మని వంట తిని చాలా రోజులైంది’ అనడంతో ఆదిత్యమాటలను గమనించిన హిమ.. ‘నువ్వు ప్రతిసారీ వ..వంటలక్కా అంటావేంటీ బాబాయ్’ అంటుంది అనుమానంగా.. అయితే మాట మారుస్తూ దీప.. ‘ఏమంటారు డాక్టర్ బాబూ..’ అనడంతో.. ‘అయ్యో నేనేం అంటాను.. మీ ఇష్టం’ అంటూ కార్తీక్ తగ్గుతాడు. దాంతో హిమ మనసులో.. ‘డాడీ వంటలక్క చెబితే వింటాడు కదా.. వంటలక్కతో చెప్పిస్తే…?’ అనుకుంటుంది.

హిమ రిక్వస్ట్.. కార్తీక్ ఫైర్..

‘వంటలక్కా నాకో హెల్ప్ చేస్తావా? ప్లీజ్.. మళ్లీ కాదనకూడదు..’ అంటూనే రిక్వస్ చేస్తుంది. దీప సరేనంటుంది. ‘వంటలక్కా మరీ మా డాడీ మా అమ్మకు విడాకులు ఇస్తాను అంటున్నాడు.. నువ్వైనా చెప్పు. మా అమ్మని ఒక్కసారి చూపించమను. మా అమ్మకు విడాకులు ఇవ్వద్దని చెప్పు.. మా అమ్మ ఎక్కడుందో అక్కడికి తీసుకుని వెళ్లమని చెప్పు..’ అంటూ బాధగా చెప్పడంతో దీప షాక్ అయ్యి చూస్తూ ఉంటుంది. కార్తీక్‌కి బాగా కోపం వస్తుంది. ‘హిమా…’ గట్టిగా అరుస్తాడు. ఆ అరుపుకు భయపడిన హిమ వణుకుతూ గట్టిగా దీపని పట్టుకుంటుంది.

నువ్వు నా ప్రాణం..

కార్తీక్ కోపాన్ని అనుచుకుని.. చుట్టూ పరిసరాలను గమనిస్తూ.. మెల్లగా హిమ దగ్గరకు వెళ్లి.. ‘రా అమ్మా.. రా..’ అంటూ తీసుకుని వెళ్లి సోపాలో కూర్చోబెట్టి.. ‘భయపడకమ్మా.. నువ్వు నా ప్రాణం. నిన్ను ఏమీ అనను.. మీ అమ్మ లేదమ్మా నిజంగానే చచ్చిపోయింది. నీకు ఎవరు చెప్పారో నువ్వు ఏం విన్నావో అదంతా అబద్దం. మీ అమ్మ లేదు. లేనిదానికి చచ్చినదానికి ఎవరైనా విడాకులు ఇస్తారా?’ అంటూ కూల్‌గా ప్రేమగా మాట్లాడుతాడు. దీప బాధగా చూస్తుంటే.. మిగిలిన వాళ్లు షాక్ అయ్యి చూస్తుంటారు. ‘మరి నువ్వే విడాకులు ఇస్తున్నావని అతను చెప్పాడు కదా?’ అంటుంది హిమ.

మళ్లీ అదే మాట.. ‘మీ అమ్మ చచ్చిపోయింది’

‘సరే ఎవరో చెప్పడం కాదు.. నేను చెబుతున్నాను. అందరి ముందూ చెబుతున్నాను. చచ్చిన మీ అమ్మ రాదు. ఇక జీవితంలో విడాకులనే మాటే రాదు. నేను నీకు మాటిస్తున్నానమ్మా.. విడాకులు ఇవ్వను. నేను చచ్చేదాకా విడాకుల మాటే ఎత్తను..’ అంటూ హిమ చేతిలో చెయ్యి వేసి మాటిస్తాడు కార్తీక్. ‘అంటే నిజంగానే మా అమ్మ చచ్చిపోయిందా?’ అంటుంది హిమ ఏడుస్తూ.. ‘అవునమ్మా.. సౌర్య వాళ్ల నాన్న ఎలా రాడో.. చచ్చిపోయిన మీ అమ్మ కూడా రాదు.’ అంటాడు కార్తీక్ కఠినంగా..

సౌర్య హ్యాపీ..

కార్తీక్ మాటలకు హిమ చాలా ఏడుస్తూ ఉంటుంది. దీపకు కూడా ఏడుపు వచ్చేస్తుంది. వెంటనే దీప హిమ దగ్గరకు వెళ్లి గుండెలకు హత్తుకుని ఏడుస్తూ.. ‘చచ్చిపోయిన మీ అమ్మని నా రూపంలో ఆ దేవుడు నన్ను పంపించాడనుకోమ్మా’ అంటుంది. కార్తీక్ కోపంగా చూస్తాడు. దీప అడ్డుగా ఉండటంతో సౌందర్య సౌర్యతో.. ‘హ్యాపీనా?’ అంటుంది నెమ్మదిగా. ‘హ్యాపీ..’ అంటూ నవ్వుతుంది సౌర్య. వెంటనే సీన్ డైవర్ట్ చెయ్యడానికి సౌందర్య లేచి.. ‘వంటలక్కా.. వంటలక్కా.. వెళ్లి వంట చెయ్యి.. నేను కూడా హెల్ప్ చేస్తాను’ అంటూ అంతా కూల్ చేస్తుంది.

భాగ్యం హంగామా..

ఆదిత్య ద్వారా దీప ఇంటికి వచ్చిందని తెలుసుకున్న భాగ్యం.. భర్త మురళీ, కూతురు శ్రావ్య దగ్గరకు వచ్చి.. ‘కొప్పమునిగింది. ప్రళయం రాబోతుంది’ అంటూ ఏదేదో హడావుడి చేస్తుంది. ‘కార్తీక్ దీపల మధ్య పెద్ద గొడవ జరుగుతుంది. వాళ్లు విడిపోవాలి. అప్పుడు కోట్లు వస్తాయి’ అంటూ ఏవేవో లెక్కలు చెబుతుంది. దాంతో శ్రావ్య తల కొట్టుకోకగా.. మురళీ మాత్రం నీ తల పగలగొడతా అంటాడు. దాంతో ‘స్టవ్ మీద అర్దపావు నెయ్యి కాచాలి’ అంటూ అక్కడ నుంచి తప్పించుకుంటుంది. ఆ సీన్ కాస్త కామెడీగా ఉంటుంది.

సౌందర్య నమ్మకం..

సౌందర్య పైకి వెళ్లి చంద్రుడ్ని చూస్తూ ఆనందంతో పొంగిపోతుంది. ఇంతలో ఆనందరావు రావడంతో.. ‘వాడు విడాకులనే కాన్సెప్ట్ ఇక ఎత్తడండీ.. చాలా హ్యాపీగా ఉంది’ అంటుంది సౌందర్య నవ్వుతూ. ‘విడాకులు ఇవ్వనంత మాత్రాన్న వాళ్లు కలిసినట్లు కాదు’ అంటాడు ఆనందరావు. ‘వాడు దాన్ని ఎన్ని మాటలు అన్నాడో మీకేం తెలుసు? అయినా దీప పట్టించుకునే మనిషి కాదు. వాళ్లు తప్పకుండా కలుస్తారని నాకు ఈ రోజే నమ్మకం కుదిరిందండీ’ అంటూ ఆనందరావుకి తన మనసులో మాట చెప్పుకుని సంబరపడిపోతుంది సౌందర్య.

సౌర్య ప్రశ్నకు షాక్ అయిన కార్తీక్..

కార్తీక్ బయట నిలబడి ఫోన్‌లో గేమ్స్ ఆడుకుంటూ ఉంటాడు. ఇంతలో సౌర్య అక్కడికి వచ్చి.. ‘డాక్టర్ బాబూ..’ అని పిలుస్తుంది. ‘ఏంటే రౌడీ?’ అంటాడు కార్తీక్. ‘మా అమ్మ అంటే మీకు ఎందుకంత కోపం డాక్టర్ బాబూ?’ అంటుంది సౌర్య బాధగా. ‘ఏంటీ?’ అంటాడు షాక్ అయ్యిన కార్తీక్. ‘మీకు మా అమ్మంటే చాలా కోపం కదా? ఎందుకు?’ అంటుంది సౌర్య మళ్లీ. ‘ఈ ప్రశ్న నిన్ను ఎవరైనా అడగమన్నారా? నువ్వే అడుగుతున్నావా?’ అంటాడు కార్తీక్ అనుమానంగా.. అయితే అదంతా దీప గమనిస్తూ ఉంటుంది.

కమింగ్ అప్‌లో…

సీన్ కట్ చేస్తే.. కార్తీక్ దగ్గరకు దీప వెళ్తుంది. వెళ్లడమే ‘థ్యాంక్స్’ అంటుంది. కార్తీక్ ‘ఎందుకు?’ అంటాడు. ‘దీపను చంపేసినందుకు..’ అంటుంది దీప బాధగా. మళ్లీ తనే మాట్లాడుతూ. ‘చచ్చిపోయిన పెళ్లానికి.. చచ్చేదాకా విడాకులు ఇవ్వను అన్నారుగా తమరు. అందుకు!, మీరు నిజంగా దేవుడు డాక్టర్ బాబూ.. ఎప్పుడో హిమ తల్లిని చంపేసి.. ఇప్పుడు ఈ వంటలక్కని బతికించారు..’ అంటూ తన బాధను వెళ్లగక్కుతూనే చేతులెత్తి దన్నం పెడుతుంది దీప. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం! కార్తీకదీపం కొనసాగుతోంది.