karthika Deepam Serial December 11th Episode Online

బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘కార్తీకదీపం’ సీరియల్ 674 ఎపిసోడ్‌లను పూర్తి చేసుకుని.. 675 ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది. తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న‘కార్తీకదీపం’ సీరియల్ నేటి (డిసెంబర్ 11) రాత్రి ఎపిసోడ్‌లో ఏం జరగనుందో ‘సమయం’లో మీకోసం ముందుగానే.

గత ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే…

బైక్ మీద నుంచి కింద పడిన కార్తీక్‌కి కాలు బెనుకుతుంది. దాంతో తన హాస్పెటల్‌కి వెళ్లిన కార్తీక్.. కాలి నొప్పికి టాబ్లెట్ వేసుకుంటాడు. ఇంతలో మౌనిత వచ్చి.. ‘ఆ మెడిసిన్ కంటే అద్భుతమైన మెడిసిన్ తీసుకొచ్చాను.. విడాకుల కేసు గెలవాలని అడ్వకేట్ పట్టుమీద ఉన్నాడు. సాయంత్రం వస్తే.. అతడితో మాట్లాడొచ్చు’ అని చెప్పి బయలుదేరుతుంది. వెంటనే ఆగి.. వెనక్కి తిరగకుండానే.. ‘కాలికి ఆయింట్‌మెంట్ రాసుకో. ఇంకో మోతాడు వేసుకో. కుంటుకుంటూ అడ్వకేట్ దగ్గరకు వచ్చి.. ‘నేను నా పెళ్లాం, పిల్లల ముందు పడిపోయాను, నా పెళ్లామే నన్ను లేపి సేవలు చేసిందని చెప్పకు’ అంటూ వెళ్లిపోతుంది. దాంతో కార్తీక్ మనసులో.. ‘ఈ విషయం మౌనితకు ఎలా తెలిసింది?’ అనుకుంటాడు.

మా డాడీని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమే కదా?

హిమ స్కూల్‌లో లంచ్ టైమ్‌లో దీపతో మాట్లాడుతుంది. ‘వంటలక్కా.. మా డాడీని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా? ఏం ఆలోచించావ్?’ అని అడగగానే దీప టెన్షన్‌తో చీర కొంగును చేత్తో పట్టుకుని.. తిప్పుతూ ఉంటుంది. ‘నాకు అర్థమైందిలే వంటలక్కా. సినిమాల్లో హీరోయిన్స్ పెళ్లి చూపుల్లో ఇలాగే సిగ్గుపడతారు.. నీకు ఇష్టమేనని ఇందాక మా డాడీ కింద పడినప్పుడే అర్థమైంది’ అంటుంది హిమ. వెంటనే దీప చీరకొంగు వదిలి ఇబ్బందిగా చూస్తుంది. మళ్లీ హిమే మాట్లాడుతూ.. ‘వంటలక్కా.. నువ్వు ఓ పని చేయాలి. మొదట సౌర్య వాళ్ల డాడీకి విడాకులు ఇచ్చేసి.. తర్వాత మా డాడీని పెళ్లి చేసుకోవాలి. లేదంటే ప్రాబ్లమ్స్ వస్తాయట’ అని అనగానే దీప షాక్ అయ్యి.. పైకి లేస్తుంది. దూరం నుంచి చూస్తున్న సౌర్య.. ‘హిమ అమ్మతో మాట్లాడేసి ఉంటుంది’ అనుకుంటూ దగ్గరకు వచ్చి.. ‘మాట్లాడుకున్నారా.. రండి తిందాం’ అంటుంది.

ఏమైంది అలా ఉన్నావ్.. వంటలక్కా?

‘మీరు తింటూ ఉండండి.. నేను డబ్బులు వసూలు చేసుకుని వస్తాను’ అంటూ బయలుదేరిన దీప.. ఎదురుగా సౌందర్యని చూసి ఆగుతుంది. ‘ఏమైంది అలా ఉన్నావ్..’ వెనుకే పిల్లల్ని గమనించి.. ‘వంటలక్కా?’ అని అడుగుతుంది. దీప ఏం లేదు మేడమ్ అనడంతో.. ‘హిమకి, సౌర్యకి నేనే స్వయంగా వంట చేసి తీసుకొచ్చాను. నేనే తినిపిస్తాను’ అనగానే.. ‘మీ హిమకి మీరు తినిపించుకోండి. నా మా అమ్మ తినిపిస్తుంది’ అంటుంది సౌర్య. ‘నువ్వు నోరుముయ్య్’ అంటూనే అన్నం కలిపి పిల్లలకు తినిపిస్తుంది సౌందర్య.

గాల్లో లెక్కలు! త్వరలో కార్తీక్‌తో పెళ్లి

 

మౌనిత పిచ్చిదానిలా గాల్లో లెక్కలు వేసుకుంటూ ఉంటుంది. అయితే అది చూసిన ప్రియమణి(పనిమనిషి).. ‘ఓరి దేవుడో.. మౌనితమ్మకు పిచ్చి పట్టేసిందా? అయ్యో.. ఇప్పుడు నేను మళ్లీ ఏ ఇంట్లో పని వెతుక్కోవాలిరా దేవుడో’ అంటూ ఏడుస్తుంది. ఇంతలో మౌనిత తేరుకుని.. ‘ఏడవకు ప్రియమణీ.. త్వరలో నా కార్తీక్.. నా శోభనబాబు.. నా డార్లింగ్.. కార్తీక్.. ఆ దీపకు విడాకులు ఇచ్చేస్తాడు. ఆ తర్వాత రెండు మూడు నెలల్లో మా పెళ్లి. అందరూ ఆహ్వానితులే.. కుళ్లుకునేవాళ్లు, ఏడ్చేవాళ్లు అందరికీ స్వాగతం’ అంటూ ఆనందపడిపోతూ ఉంటుంది. మళ్లీ తనే మాట్లాడుతూ.. ‘చూడు ప్రియమణీ.. నీకు ఆ ఇంట్లో పనిమనిషిగా ఉద్యోగం వచ్చేలా చేస్తాను. ఆ మాలతీ(సౌందర్య ఇంట్లో పనిమనిషి)ని పీకించి.. నిన్ను అక్కడికి చేరుస్తాను. నా బాబు కార్తీక్‌తో ఈ పని చేయిస్తాను’ అంటుంది మౌనిత.

కేజీ భాగ్యం!

భాగ్యం కింద కూర్చుని సరుకులు సర్దుకుంటూ ఉంటుంది. ‘కేజీ అయితే ఇంత వస్తుందా?’ అనుకుంటూ ఉండగా.. శ్రావ్య కాస్త షాక్ అవుతూ చూస్తుంది. ఇంతలో అక్కడకి వచ్చిన ఆదిత్య.. బుర్ర గోక్కుంటూ.. ‘శ్రావ్య ఇది మీ ఇల్లేనా? నువ్వేనా.’ అంటూ పిచ్చిపిచ్చిగా మాట్లాడుతూ.. కాసేపటికి తేరుకుని.. ‘అత్తగారిలో సడన్‌గా ఈ మార్పు ఏంటీ?’ అంటాడు. ‘ఏం లేదు బాబూ.. అందరూ అర్ధ పావు భాగ్యం అర్ధ పావు భాగ్యం అంటున్నారని అన్నీ కేజీ కొనడం మొదలు పెట్టాను బాబు’ అంటుంది భాగ్యం. ‘శ్రావ్యా బయలుదేరదామా?’ అని ఆదిత్య శ్రావ్యతో అనగానే.. ‘ఎక్కడికి బాబూ.. అర లీటర్ టీ తాగి వెళ్లండి’ అంటూ హడావుడి చేస్తుంది. ‘నేను ఈ మార్పుని భరించలేను.. ఇక్కడే ఉంటే 10 కేజీల పిచ్చి పట్టేలా ఉంది’ అంటూ శ్రావ్యని చెకప్‌కి తీసుకుని వెళ్తాడు ఆదిత్య.

ఏంటో ఈ పరిస్థితి?

పిల్లలు తిన్న తర్వాత సౌందర్య, దీపలు పక్కకు వెళ్లి మాట్లాడుకుంటూ ఉంటారు. ‘అత్తయ్యా.. హిమ నాతో ఏం అందో తెలుసా?’ అంటూ జరిగిందంతా చెబుతుంది. ‘నా భర్తకు నేనే విడాకులు ఇవ్వాలట అత్తయ్యా..’ అంటూ బాధపడుతుంది. ‘అసలు ఆయన(కార్తీక్) ఏం అనుకుంటున్నాడో తెలియని పరిస్థితిలో ఉన్నాను నేను. పిల్లలు చూస్తే ఇలా..?’ అంటూ కళ్లనిండా నీళ్లతో తన బాధని తన అత్తగారితో చెప్పుకుంటుంది.

దీప ఆవేశం..

‘ఏంటి అత్తయ్యా ఆలోచిస్తున్నారు?’ అంటుంది దీప. ‘ఏం లేదు దీపా.. ఆ మౌనిత బాగా ఎక్కువ చేస్తోంది. మొన్న శ్రావ్య దగ్గరకు వచ్చి.. నా గురించి ఏవో అవకులు చవాకులు పేలిందట’ అని విషయం పూర్తి కాకుండానే దీప ఆవేశంతో రగిలిపోతుంది. ‘ఏంటి అత్తయ్యా? ఆ మౌనిత మిమ్మల్ని అంటుందా? అసలు ఏం అనుకుంటుంది? దాన్ని వదిలేదే లేదు.. నన్ను ఎన్ని అన్నా ఊరుకున్నాను. మిమ్మల్ని అంటే ఊరుకున్నాను. కానీ మిమ్మల్ని అంటే ఊరుకునేదే లేదు’ అంటూ ఆవేశంగా రగిలిపోతూ ఊగిపోతూ ఉంటుంది. సౌందర్య ఎంత ఆపినా, ఎన్ని సార్లు అడ్డుకున్నా ‘మిమ్మల్ని అంటుందా? మీ కాలి గోటికి కూడా సరిపోని ఓ ఆడది.. అది మిమ్మల్ని అంటుందా?’ అంటూ ఆవేశంతో ఊగిపోతుంది. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం! కార్తీకదీపం కొనసాగుతోంది.