బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘కార్తీకదీపం’ సీరియల్ 667 ఎపిసోడ్లను పూర్తి చేసుకుని.. 668 ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది. ఈ ఎపిసోడ్ హైలైట్స్ మీకోసం. తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న‘కార్తీకదీపం’ సీరియల్ నేటి (డిసెంబర్ 3) రాత్రి ఎపిసోడ్లో ఏం జరగనుందో ‘సమయం’లో మీకోసం ముందుగానే.
గత ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
మౌనితకి కార్తీక్ క్లారిటీ ఇస్తాడు. ‘ఇవాళ నువ్వు నా మీద విసిరిన చురకలు, వెటకారంగా మాట్లాడిన మాటలు ఇవేం నేను పట్టించుకోలేదు. కానీ చివర్లో నువ్వు గుర్తు చేసిన కోర్టు గురించి ఆలోచించడం మొదలు పెట్టాను. నిజమే కోర్టు గడువు పూర్తయ్యే సరికి దీపని నేను పర్మినెంట్‌గా దూరం చేసుకుంటాను’ అంటూ వెనక్కి తిరిగి చెబుతూనే ఉంటాడు. దీపని దూరం చేసుకుంటానన్న మాట వినగానే మౌనిత ఆనందం పట్టలేక తనలో తనే నవ్వుకుంటుంది. సంతోషంతో పొంగిపోతుంది. ‘అవసరమైతే ఇన్ని రోజులు ఏ విషయాన్నైతే దాచి పెట్టి.. కోర్టులో దీప పరువు తీయ్యకుండా ఉన్నానో అది కూడా బయటపెట్టి.. దీప పరువు తీసైనా సరే తనని దూరం చేసుకుంటాను. దీప నా లైఫ్‌లోకి రాకుండా చూసుకుంటాను. కోర్టు గడువు పూర్తి కావడం కోసమే వెయిట్ చేస్తున్నాను’ అంటాడు కార్తీక్.
దీప షాక్
హిమ స్కూల్లో దీపను పక్కకు తీసుకుని వెళ్లి.. తల కిందకు వంచుకుని.. దీపతో మాట్లాడుతుంది. ‘మరీ.. మా డాడీ చాలా అందంగా.. పొడవుగా ఉంటాడుగా. పైగా తను చాలా మంచివాడు కూడా. కానీ మా డాడీని ఇంట్లో ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. నాకు మా అమ్మ కూడా లేదు కదా’ అంటూ నసుగుతుంది హిమ. ‘ఏం చెబుతున్నావమ్మా? ఇదంతా నాకెందుకు చెబుతున్నావ్?’ అంటుంది దీప. ‘మరి నువ్వు మా డాడీని పెళ్లి చేసుకుంటావా?’ అంటుంది హిమ ఒక్కసారిగా. దీప సడన్‌గా పైకి లేస్తుంది. కోపంగా హిమ వైపు చూస్తుంది. హిమ భయపడుతుంది. నిస్సహాయపు చూపులతో కాస్త తేరుకున్న దీప.. తర్వాత హిమ తలను నిమురుతుంది.
సౌర్యకు చెప్పొద్దు
‘వంటలక్కా.. ఇప్పుడే నీ నిర్ణయం చెప్పొద్దులే.. నువ్వు చాలా మంచిదానివి. అందరినీ బాగా చూస్తావ్. నువ్వే నా కొత్తమ్మగా వస్తే నేను ఇప్పటికంటే ఎక్కువ ఆనందంగా ఉంటాను. ఇక మా డాడీని నేను ఎలాగైనా ఒప్పిస్తాను. తను నేను చెబితే కాదు అనడు వంటలక్కా’ అంటుంది హిమ నమ్మకంగా. దీప క్యారేజ్‌ల బుట్ట తీసుకుని బాధగా ముందుకు కదులుతుంది. ‘వంటలక్కా.. ప్లీజ్ ఈ విషయం మాత్రం సౌర్యకు చెప్పొద్దు’ అంటుంది హిమ భయపడుతూ. దీప అదే బాధతో అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
మౌనితకి అశుభం
‘ప్రియమణీ(పనిమనిషి).. ప్రియమణీ’ అంటూ సంబరపడిపోతూ అరుస్తూ వస్తుంది మౌనిత. ‘ఒక్క నిమిషం అమ్మా వస్తున్నా.. అక్కడే ఆగండి’ అంటూ హారతి పట్టుకుని వస్తుంది ప్రియమణి. ‘ఇదేంటే నేను శుభవార్తతో వచ్చానని నీకు ఎలా తెలిసింది?’ అనడంతో ‘ఆ పిలుపులో రిథమ్ ఉందమ్మా.. అందుకే కనిపెట్టేశాను’ అంటూ హారతి ఇవ్వబోతుంది. వెంటనే హారతి ఆరిపోతుంది. మౌనిత షాక్ అయ్యి.. ‘ఇదేంటే దీపం ఆరిపోయింది’ అంటుంది టెన్షన్‌గా.
ప్రియమణి వివరణ
‘అమ్మా మీరు ఏం అనుకోనంటే మీ భుజం మీద చేయి వేసుకోవచ్చా?’ అంటుంది ప్రియమణి రిక్వస్ట్‌గా మౌనితని. దానికి మౌనిత పర్మీషన్ ఇవ్వడంతో.. మౌనిత భుజం మీద చేయి వేసిన ప్రియమణి.. వివరణ ఇస్తుంది. ‘అమ్మా మీరు ఏం అన్నారు.. దీపం ఆరిపోయింది.. అన్నారు కదా. అవునమ్మా దీప బతుకు ఆరిపోయిందనేగా’ అంటూ తొక్కలో వివరణ ఒకటి ఇచ్చి.. మౌనిత రాక్షసానందానికి కారణం అవుతుంది.
దీప ఆవేదన
‘ఏంటే ఉన్నట్టుండి రమ్మన్నావ్?’ అంటుంది సౌందర్య. ‘ఏం లేదు అత్తయ్యా.. హిమ ఆలోచనలు ఏమై ఉంటాయా అని అనుకున్నాం కదా.. అదేంటో అర్థమైంది అత్తయ్యా. ఈ రోజు నన్ను మా డాడీని పెళ్లి చేసుకోమని అడిగింది’ అంటూ జరిగింది చెబుతుంది. ‘మంచిదే కదా?’ అంటుంది సౌందర్య. ‘ఏం మంచిదత్తయ్యా? మరి మెడలో ఆయనే కట్టిన తాళిని ఏం చేయాలి? అయినా హిమ మనసు అలా మారడానికి మీరే కారణం అత్తయ్యా’ అంటూ బాధపడుతుంది.
ఆనందరావు సముదాయింపు
‘మీరైనా చెప్పండి మావయ్యా.. అసలు ఇది జరిగే పనేనా?’ అంటుంది దీప. దాంతో ఆనందరావు కూడా.. ‘ఎందుకమ్మా భయపడతావ్.. అటు సౌర్య తండ్రి కావాలనుకుంటుంది. ఇటు హిమ నిన్నే కొత్తమ్మగా కావాలనుకుంటుంది. ఇది మంచి అవకాశమే కదా?’ అంటాడు. అయితే దీప మాత్రం అందుకు తలొగ్గదు. ‘లేదు మావయ్యా.. ఇదంతా జరగని పని. అసలు ఈ విషయం సౌర్యకి తెలిస్తే ఇల్లు పీకి పందిరేస్తుంది’ అంటుంది.
ఆ మనిషి వదిలిపెట్టడు
‘మీరు పిల్లలు ఆలోచనల వరకే ఆలోచిస్తున్నారు. నేను ఆయన స్పందన గురించి ఆలోచిస్తున్నాను. హిమ ఈ విషయాన్ని ఆయనతో మాట్లాడిన మరుక్షణమే.. నన్ను, నా కూతుర్ని ఈ ఊరు వదిలిపోయేదాకా ఆ మనిషి వదిలిపెట్టడు. ఏం మాటలు అంటాడే తెలియదు. అసలు ఆ మనిషిలో ఉన్న అనుమానం పోయేదాకా నా బతుకు ఇంతే’ అంటుంది బాధగా.
పాపం దీప
వెంటనే పెద్దగా నవ్వుతూ.. ఆ వెర్రి నవ్వులో ఏడుపును ఆపుకుంటూ.. ‘లోకంలో ఎక్కడైనా ఒక కన్నకూతురు అమ్మకు నాన్నకు పెళ్లి చేయడం ఎప్పుడైనా అనుకుంటుందా? అది(హిమ) నాకు ఆయనకి పెళ్లి చేస్తుందట’ హ..హ.. అంటూ పెద్దగా నవ్వుతుంది. అలా నవ్వుతూనే.. పిచ్చిగా చూసుకుంటూ సౌందర్య ఆపుతున్నా ఆగకుండా నడుచుకుంటూ వెళ్లిపోతుంది. ఆ సీన్ ప్రేక్షకుల గుండెలను తడి చేయక మానదు.
క్లారిటీ తీసుకున్న సౌర్య
గతంలో ఒకసారి ‘అమ్మా సర్టిఫెకెట్స్లో రాయాలట.. నాన్న పేరు ఏంటీ?’ అనడంతో అప్పుడు దీప.. ‘మీ నాన్న పేరు కార్తీక్’ అని చెబుతుంది. ఆ మాటలు తలుచుకుంటూ ఆటోలో వెళ్తున్న సౌర్య.. ‘రేయ్ వారణాసీ డాక్టర్ బాబు పేరేంట్రా?’ అంటుంది. ‘కార్తీక్.. సౌర్యమ్మా.. డాక్టర్ కార్తీక్ అంటారుగా అందరూ?’ అంటాడు వారణాసి. దాంతో సౌర్య మనసులో.. ‘అంటే వీడికి కూడా విషయం తెలుసు. అక్కడ డాక్టర్ బాబుకీ అంతా తెలుసు. ఎవ్వరూ నోరు మెదపట్లేదు. కానీ అమ్మ మాత్రం నాన్న పేరు నిజమే చెప్పింది’ అనుకుంటుంది.
సౌందర్య నీతి కథ
హిమ డ్రాయింగ్ వేస్తూ ఉంటే సౌందర్య, ఆనందరావులు వెనుక నుంచి చూస్తూ.. ‘ఎంతైనా మన ప్రయత్నం ఫలించింది. దీని(హిమ) మీద బాగానే పని చేసిందండీ’ అనుకుంటూ నవ్వుకుంటూ వస్తారు. అది చూసి హిమ వెంటనే డ్రాయింగ్ బుక్ దాచి.. ఏం తెలియనట్లు చూస్తుంది. అయితే సౌందర్య మరింత గట్టిగా.. చదువు గురించి చెబుతున్నట్లుగా.. ‘ఉత్తములు, మధ్యములు, అదములు కథ చెప్పి ఉత్తములు మాత్రమే చెపట్టిన పనిని మధ్యలో వదలకుండా పూర్తి చేస్తారు’ అంటూ చెబుతుంది.
మనమెక్కడ సౌందర్య
‘ఇదంతా నాకు ఎందుకు చెబుతున్నావు నాన్నమ్మా?’ అన్న హిమతో సౌందర్య.. ‘ఏ పని చేపట్టినా ఆపకుండా పూర్తి చేస్తావని’ అంటూనే.. మనసులో.. ‘మీ అమ్మనీ నాన్ననీ కలుపుతావని’ అనుకుంటుంది. హిమ కూడా మనసులో.. ‘వంటలక్కా, డాడీ పెళ్లి జరిగేదాకా.. నేనూ నా ప్రయత్నాలు ఆపను’ అనుకుంటుంది. హిమ వెళ్లగానే ఆ డ్రాయింగ్ బుక్ చూసి ఆనందరావు.. ‘చూశావా సౌందర్య.. కేవలం వాళ్ల ఫ్యామిలీనే వేసుకుంది. మనం ఎక్కడంటా?’ అంటూ హట్ అవుతాడు. దాంతో సౌందర్య నవ్వుతూ.. ‘వాళ్లు బాగుంటే చాలు. కలిసిపోతే చాలు.. మనం వాళ్లతో లేకపోయినా ఫర్వాలేదు’ అంటుంది.
కమింగ్ అప్‌లో…
సౌర్య ఇంట్లో కూర్చుని రాస్తూ ఉంటుంది. ‘సౌర్య.. డాటర్ ఆఫ్ కార్తీక్’ అని చదువుతూ రాస్తుంది. వెంటనే దీప గుండె జల్లుమంటుంది. వెనుకే ఉన్న వారణాసి కూడా షాక్ అవుతాడు. సీన్ కట్ చేస్తే.. ‘రేయ్ వారణాసీ.. బయటకి వెళ్దాం పదరా’ అంటుంది. ‘ఎక్కడికి సౌర్యమ్మా?’ అంటాడు వారణాసి. ‘డాక్టర్ కార్తీక్ దగ్గరకు’ అనడంతో దీప మరింత షాకింగ్‌గా చూస్తుంది. వారణాసి బిత్తరపోయి చేతిలో ఫోన్ వదిలేస్తాడు. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం. కార్తీకదీపం కొనసాగుతోంది.