రియల్ లవ్ స్టోరీ బయటపెట్టిన హీరో

ఆర్ఎక్స్100 సినిమాలో భగ్న ప్రేమికుడిగా నటించిన కార్తికేయ, ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఆ తర్వాత హిట్-ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. తాజాగా తన రియల్ లవ్ స్టోరీని బయటపెట్టాడు ఈ హీరో. నిజజీవితంలో కూడా తనది సక్సెస్ ఫుల్ లవ్ స్టోరీ కాదంటున్నాడు.

“కాలేజ్ డేస్ లో ఓ అమ్మాయిని బాగా ఇష్టపడ్డాను. అది లవ్ అవునో కాదో కూడా తెలీదు. చాలా క్లోజ్ గా ఉండే వాళ్లం. కాలేజ్ అయిన తర్వాత చిన్న చిన్న గొడవలొచ్చి విడిపోయాం. నా సినిమాలు చూసిన తర్వాత మళ్లీ టచ్ లోకి వచ్చింది. అప్పుడప్పుడు పలకరిస్తుంది.”

ఇప్పుడు తనతో మాట్లాడుతున్నప్పటికీ, ఒకప్పటి ఫీలింగ్స్ లేవని, తను కేవలం ఓ ఫ్రెండ్ గా మాత్రం ఉందని అంటున్నాడు కార్తికేయ. ప్రస్తుతం తనకు ఎలాంటి ఎఫైర్లు లేవని, సింగిల్ గా ఉన్నానని చెబుతున్నాడు.

గ్యాంగ్ లీడర్ సినిమాలో విలన్ గా నటించిన కార్తికేయ.. కేవలం హీరోగా నటించే ఉద్దేశం లేదని అంటున్నాడు. మంచి పాత్ర దొరికితే.. అది హీరో అయినా, విలన్ అయినా, క్యారెక్టర్ రోల్ అయినా చేస్తానంటున్నాడు. అలాంటి ఓ మంచి పాత్ర దొరికింది కాబట్టే త్వరలోనే తమిళ్ లో ఓ సినిమా చేయబోతున్నట్టు ప్రకటించాడు కార్తికేయ.