పీఎంగారు సాయం చేయండి : కేసీఆర్‌ లేఖ

తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల పాటు కురిసిన వర్షాలతో రోడ్లన్ని నదులను తలపిస్తున్నాయి, పొలాలు చెరువులను తలపిస్తున్నాయి, చెరువులు జలాశయాలు సముద్రాలను తలపిస్తున్నాయి. వర్షాల కారణంగా భారీగా పంట నష్టం, ఆస్తినష్టం ప్రాణనష్టం కూడా జరిగింది. తెలంగాణలో మరో రెండు వారాల్లో పంట కోతకు సిద్దంగా ఉండగా వర్షాల కారణంగా పూర్తిగా పంట నీట మునిగింది. చేతికి అంది వచ్చిన పత్తి పంట మొత్తం నాశనం అయ్యింది. ఇక హైదరాబాద్‌ లో పరిస్థితి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

వందేళ్లలో ఎప్పుడు చూడని వరదను హైదరాబాద్‌ వాసులు చూశారు. ప్రస్తుతం నష్టం అంచనా వేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ సమయంలోనే కేంద్ర ప్రభుత్వం తక్షణ సహాయ చర్యల కోసం రూ.1350 కోట్లను విడుదల చేయాలంటూ ప్రధాని నరేంద్ర మోడీకి టీ సీఎం కేసీఆర్‌ విజ్ఞప్తి చేస్తూ ఒక లేఖను రాయడం జరిగింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలకు తమ వంతు సాయం తప్పకుండా అందిస్తాం అంటూ భారత ప్రధాని నరేంద్ర మోడీ మరియు రాష్ట్రపతి కూడా హామీని ఇచ్చారు. తక్షణ సాయంను కేంద్రం విడుదల చేస్తుందా అనేది ఒకటి రెండు రోజుల్లో తెలిసే అవకాశం ఉంది.

మరో వైపు తెలంగాణ వ్యాప్తంగా ఈ వర్షాలు, వరదల వల్ల దాదాపుగా 50 మంది వరకు చనిపోయారు, ఇందులో జీహెచ్ఏంసీ పరిధిలోనే 11 మంది వున్నారు. చనిపోయిన వారి కుటుంబసభ్యులకు ప్రభుత్వం తరుపున వెంటకే ఎక్స్ గ్రేషియా 5 లక్షలు ఇవ్వవలసిందిగా కెసిఆర్ ప్రకటించారు.

అదే సమయంలో జీహెచ్ఏంసీ లో కొనసాగుతున్న సహాయక చర్యల కోసం 5 కోట్లు విడుదల చేస్తున్నట్లు సిఎం తెలిపారు. ప్రజలకు యుద్ధ ప్రాతిపదికన సహాయ కార్యక్రమాలు మరియు అవసరమైన బియ్యం, పప్పు ఇతర సామగ్రితో పాటు ప్రతి ఇంటికి ఆహారం, 3 చొప్పున దుప్పట్లను ప్రభుత్వ పక్షాన వెంటనే అందించాలని సీయం కేసీఆర్ అధికారులను ఆదేశిం