కీర్తి సురేష్ పెళ్లిపై తల్లి క్లారిటీ

కీర్తి సురేష్‌ మహానటి తర్వాత పాన్‌ ఇండియా హీరోయిన్ గా మారిపోయింది. ఆమె ఒక వైపు కమర్షియల్‌ సినిమాలు చేస్తూనే మరో వైపు లేడీ ఓరియంటెడ్‌ సినిమాలు కూడా కీర్తి సురేష్‌ చేస్తూ కెరీర్‌ పరంగా దూసుకు పోతుంది. ఇలాంటి సమయంలో కీర్తి సురేష్‌ పెళ్లి పీఠలు ఎక్కబోతుంది అంటూ మీడియాలో గత కొన్నాళ్లుగా ప్రచారం జోరుగా సాగుతోంది. ఆమద్య ఒక బిజినెస్‌ మ్యాన్‌ తో ఈమె వివాహం కు ఏర్పాట్లు జరిగాయి అంటూ వార్తలు వచ్చాయి. ఆ తర్వాత సంగీత దర్శకుడు అనిరుథ్‌ తో ఈమె ప్రేమలో ఉన్నట్లుగా ప్రచారం జరిగింది. కాని అవన్నీ కూడా పుకార్లే అంటూ తేలిపోయింది.

ఒక మలయాళ మీడియా సంస్థతో కీర్తి సురేష్ తల్లి మేనక మాట్లాడుతూ ఇప్పటి వరకు తమ కూతురు పెళ్లి గురించి ఎలాంటి ఆలోచన చేయలేదు అంటూ క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతానికి కీర్తి పెళ్లి కాని ప్రేమపై కాని ఎలాంటి ఆసక్తి లేకుండా కెరీర్‌ పరంగా బిజీగా ఉందని చెప్పుకొచ్చింది. పెళ్లి పై ఆసక్తి లేని కీర్తి సురేష్‌ కెరీర్‌ పైనే దృష్టి పెట్టినట్లుగా చెప్పుకొచ్చింది. మేనక ఇంటర్వ్యూతో కీర్తి సురేష్‌ పెళ్లి వార్తలపై క్లారిటీ వచ్చేసినట్లయ్యింది.