కీర్తి సురేష్-గుడ్ లక్ సఖీ

మహానటి సినిమా నుంచి కీర్తి సురేష్ లైనప్ నే మారిపోయింది. మంచి మంచి కథలు, హీరోయిన్ కు, నటనకు ప్రాధాన్యం వున్న సినిమాలు ఒకే చేసుకుంటోంది. ఇప్పటికే అలాంటి రెండు సినిమాలు ఫినిషింగ్ స్టేజ్ లో వున్నాయి. ఈస్ట్ కోస్ట్ సంస్థ నిర్మించే మిస్ ఇండియా దాదాపు పూర్తయింది. విడుదలకు రెడీ అవుతోంది. దిల్ రాజు సహకారంలో నగేష్ కుకునూరు డైరక్షన్ లో ఓ సినిమా చేస్తోంది కీర్తి.

ఈ సినిమా ప్రాజెక్టు దిల్ రాజు దగ్గరకు వచ్చే సరికి వేరే టైటిల్ అనుకున్నారని బోగట్టా. కానీ దానికి నెగిటివ్ సౌండ్ వుండడంతో, ఆయన మార్చమని సూచించారు. దాంతో ఇఫ్పుడు మాంచి టైటిల్ ఫిక్స్ చేసారు. ‘గుడ్ లక్ సఖీ’ అన్నది టైటిల్ అని తెలుస్తోంది.

సఖీ అన్న పదంలోనే మంచి ఫీల్ వుంటుంది. దానికి తోడు గుడ్ లక్ సఖీ అంటే ఇంకా పాజిటివ్ వైబ్ వుంటుంది. కరోనా లాక్ డౌన్ అయిన తరువాత ఓనెల రోజులు టైమ్ ఇస్తే రెడీ అయిపోయ సినిమాల జాబితాలో కీర్తి సినిమాలు రెండూ వున్నాయి.