కన్నడ స్టార్ యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కి విడుదలకు సిద్దం అయిన కేజీఎఫ్ 2 ను ఏప్రిల్ 14న విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే ప్రకటించారు. రెండేళ్ల క్రితం విడుదల అవ్వాల్సిన ఈ సినిమా కరోనా బ్యాచ్ లో పడి వాయిదాలు పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ సినిమా ను విడుదల చేసేందుకు సిద్ధం చేయగా ఏదో ఒక సినిమా తో పోటీ తప్పడం లేదు. పాన్ ఇండియా రేంజ్ లో కేజీఎఫ్ 2 ను విడుదల చేయబోతున్నారు.
పాన్ ఇండియా రేంజ్ లో కేజీఎఫ్ 2 ను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు కనుక ఏదో ఒక భాష సినిమా తో ఎక్కడో ఒక చోట క్ల్యాష్ తప్పదు. అయితే అవి చిన్న సినిమాలు అయితే పర్వాలేదు కాని సూపర్ స్టార్ సినిమాలు అయితే మాత్రం కష్టా లు తప్పవు. తెలుగు లో ఈ సినిమా కు పోటీగా చిన్న సినిమాలే ఉంటాయి. కాని తమిళంలో మాత్రం ఈ సినిమా వసూళ్లు దక్కించుకోవాలంటే సూపర్ స్టార్ సినిమా తో తలపడాల్సి వస్తుంది.
తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన బీస్ట్ సినిమా ను అదే తేదీన విడుదల చేసేందుకు సిద్దం అవుతున్నారు. ఇప్పటికే షూటింగ్ ప్రారంభం అయ్యింది. అరబిక్ కుత్తు పాటను విడుదల చేసి ప్రమోషన్ ను కూడా షురు చేశారు. కనుక సినిమా విడుదల వాయిదా అనేది ఖచ్చితంగా పడదు. కనుక కేజీఎఫ్ 2 సినిమా తమిళ నాట బీస్ట్ సినిమా తో పోటీ పడి ఆ పోటీలో నెగ్గి వసూళ్లను దక్కించుకోవాల్సి ఉంటుంది.
విజయ్ సినిమా అంటే ఖచ్చితంగా వంద కోట్ల వసూళ్లు ఖాయం. అలాంటి సినిమా ఉన్న సమయంలో కేజీఎఫ్ 2 ను అక్కడ చూస్తారా అంటే ఖచ్చితంగా అనుమానమే అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. విజయ్ సినిమా వచ్చే సమయంలో తమిళ స్టార్ హీరోలే తమ సినిమాలను వాయిదా వేసుకున్న సందర్భాలు ఉన్నాయి. కనుక కేజీఎఫ్ 2 ను అరవ తంబీలు పక్కన పెడతారేమో అనిపిస్తుంది అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
సాదారణంగానే తమిళ తంబీలకు భాషాభిమానం ఎక్కువ అంటారు. అలాంటి భాషాభిమానం ఉన్న వారు తమ బీస్ట్ ను పక్కన పెట్టి కేజీఎఫ్ 2 ను చూస్తారా అంటే చూడరేమో అనే సమాధానం ఎక్కువ మందిలో వినిపిస్తుంది. కనుక కేజీఎఫ్ 2 మేకర్స్ తమిళ నాట నుండి భారీ వసూళ్లు ఆశించి నిరాశ పడవద్దు అనేది కొందరి సలహా. కేజీఎఫ్ 2 కి కన్నడ లో ఖచ్చితంగా భారీగా వసూళ్లు నమోదు అవుతాయి.
ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి ఓపెనింగ్స్ దక్కించుకునే అవకాశం ఉంది. ఇక బాలీవుడ్ లో ఈ సినిమా వసూళ్ల విషయంలోనే ఇప్పుడు ప్రథాన చర్చ జరుగుతోంది. పోటీగా భారీ సినిమాలు ఏమీ లేకున్నా కూడా అక్కడ నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది.. తద్వార ఎలాంటి వసూళ్లు నమోదు అవుతాయి అనేది ఆసక్తికరంగా మారింది. తమిళనాడు మరియు ఉత్తరాది ఏరియాలు కేజీఎఫ్ 2 కు కీలకంగా మారాయి. అక్కడి ఫలితాన్ని బట్టి ఓవరాల్ వసూళ్లు ఉంటాయి అంటూ టాక్ వినిపిస్తుంది.