చరిత్ర సృష్టించిన చిరంజీవి

బాహుబలి’ ఫుల్‌ రన్‌ రికార్డులు కొట్టాలంటే మళ్లీ ‘బాహుబలి 2’ రావాల్సిందే అనుకునే లెవల్లో సంచలనాలు చేసిన రాజమౌళి మాగ్నమ్‌ ఓపస్‌ రికార్డు ఒకదానిని ‘ఖైదీ నంబర్‌ 150’ అధిగమించింది. ఉత్తరాంధ్రలో ‘బాహుబలి’ ఫుల్‌ రన్‌ రికార్డుని బీట్‌ చేయడమే కాకుండా ఈ ప్రాంతంలో పది కోట్లకి పైగా షేర్‌ సాధించిన తొలి చిత్రంగా కూడా చరిత్ర సృష్టించింది. ఉత్తరాంధ్రని ‘మెగా అడ్డా’గా పిలుస్తుంటారు. అది నిజమేనని నిరూపిస్తూ చిరంజీవి తన పునరాగమన చిత్రంతో చరిత్ర సృష్టించారు.

కేవలం పది రోజుల్లో పది కోట్ల షేర్‌ సాధించిన ఈ చిత్రం ఇప్పటికీ హౌస్‌ఫుల్స్‌తో నడుస్తోంది. ఫుల్‌ రన్‌లో మరిన్ని కోట్లు సాధించి ‘బాహుబలి 2’కి పెద్ద టార్గెట్‌ సెట్‌ చేస్తుందని భావిస్తున్నారు. బాహుబలి తొలి వారం రికార్డులన్నిటినీ ఆంధ్ర ప్రాంతంలో బ్రేక్‌ చేసిన ‘ఖైదీ నంబర్‌ 150’, రెండవ స్థానానికి పెద్ద బెంచ్‌ మార్క్‌నే సెట్‌ చేస్తోంది. ఈ చిత్రంపై భారీగా వెచ్చిస్తున్న బయ్యర్లని పిచ్చివాళ్లుగా చూసిన వాళ్లంతా నోళ్లు వెల్లబెడుతున్నారు.

పది రోజులు తిరగకుండా మాగ్జిమం ఏరియాల్లో బయ్యర్లు ప్రాఫిట్స్‌లోకి వెళ్లారు. బాహుబలి తర్వాత వంద కోట్ల షేర్‌ సాధించే చిత్రంగా ఇది నిలుస్తుందని ట్రేడ్‌ వర్గాల వారు చెబుతున్నారు. ఆ మార్కు చేరుకోవడానికి ఖైదీ ఎన్ని రోజులు తీసుకుంటుందో చూడాలి.