మహేష్‌23కి ‘ఖైదీ 150’ టచ్‌!

మహేష్‌తో మురుగదాస్‌ తెరకెక్కిస్తున్న చిత్రానికి ఇంకా పేరు నిర్ణయించలేదు. ప్రస్తుతానికి ‘మహేష్‌23’గా పిలవబడుతోన్న ఈ చిత్రం కూడా మురుగదాస్‌ స్టయిల్లో ఒక స్ట్రాంగ్‌ సోషల్‌ ఇష్యూ బ్యాక్‌డ్రాప్‌లో వుంటుందట.

మురుగదాస్‌ తీసిన ‘కత్తి’ శైలిలో సోషల్‌ మెసేజ్‌, కమర్షియల్‌ ఎలిమెంట్స్‌, యాక్షన్‌ మిక్స్‌ అయి వుంటాయట. ఆ కత్తి తెలుగులోకి ఖైదీ నంబర్‌ 150గా రీమేక్‌ అయి ఘన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. మురుగదాస్‌ తీసే సినిమాల్లో చాలా వరకు ఇలాంటి సోషల్‌ మెసేజ్‌తోనే నడుస్తుంటాయి. రమణ (ఠాగూర్‌), స్టాలిన్‌ చిత్రాల్లోను మురుగదాస్‌ తన కథకి సామాజిక సందేశాన్ని పునాదిగా పెట్టుకున్నాడు.

ఈసారి ఏ పాయింట్‌పై మురుగదాస్‌ ఫోకస్‌ పెట్టాడనేది ఆసక్తికరం. ఈ చిత్రంతో మహేష్‌ తమిళ చిత్ర సీమలోకి అఫీషియల్‌గా ఎంటర్‌ అవుతున్నాడు. మురుగదాస్‌ ఇమేజ్‌తో మహేష్‌కి అక్కడ లాంఛ్‌ప్యాడ్‌ బ్రహ్మాండంగా సెట్‌ అవుతుందని అనుకుంటున్నారు. విజయ్‌తో వరుసగా రెండు భారీ హిట్లు ఇచ్చిన మురుగదాస్‌ అదే ఫీట్‌ని మహేష్‌తో చేయగలడో లేదో చూడాలి. ఈ చిత్రంలో యాక్షన్‌ పార్ట్‌ హైలైట్‌గా నిలుస్తుందని, కేవలం యాక్షన్‌ పార్ట్‌ కోసమే నలభై కోట్ల వరకు ఖర్చు పెట్టారని టాక్‌ వుంది.