రాష్ట‌ప‌తి ఓట్ల లెక్క ఎలా చేస్తారంటే

దేశ ప్ర‌థ‌మ పౌరుడిగా కొత్త నేత‌ను ఎన్నుకునే స‌మ‌యం వ‌చ్చేసింది. rnప్ర‌స్తుత రాష్ట్రప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ వ‌చ్చే నెల‌లో ప‌ద‌వీ విర‌మ‌ణ rnచేయ‌నున్నారు. దాదా స్థానంలో కొత్త‌గా రాష్ట్రప‌తి భ‌వ‌న్‌లో కాలు rnపెట్ట‌బోయే నేత‌ను ఎన్నుకునే క్ర‌తువు ఇప్ప‌టికే ప్రారంభ‌మైపోయింది. rnఅంటే… రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ జారీ అయిపోయింద‌న్న‌మాట‌. ఇక ఈrn ఎన్నిక‌లో కీల‌క అంశంగా ప‌రిగ‌ణించే పోలింగ్ వ‌చ్చే నెల 17న rnజ‌ర‌గ‌నుండ‌గా, ఆ త‌ర్వాత మూడు రోజులకు అంటే… వ‌చ్చే నెల 20న కౌంటింగ్ rnజ‌ర‌గ‌నుంది. కేంద్రంలో అధికార కూటమి ఎన్డీఏ త‌న అభ్య‌ర్థిగా బీజేపీ rnసీనియ‌ర్ నేత‌, నిన్న‌టిదాకా బీహార్ గ‌వ‌ర్న‌ర్‌గా ప‌నిచేసిన రామ్‌నాథ్ rnకోవింద్‌ను ఎంపిక చేసింది. కోవింద్ అభ్య‌ర్థిత్వంపై ఏకాభిప్రాయం వ్య‌క్తం rnచేయ‌ని విప‌క్షాలు త‌మ అభ్య‌ర్థిగా మ‌రి కొంద‌రిని బ‌రిలోకి దింప‌నున్నాయి.rn దీంతో ఈ ద‌ఫా కూడా రాష్ట్రప‌తి ప‌ద‌వికి పోలింగ్ త‌ప్ప‌ద‌న్న మాట‌.

ఇక rnరాష్ట్రప‌తి ఎన్నిక విష‌యానికి వ‌స్తే… సాధార‌ణ ఎన్నిక‌ల‌కు, రాష్ట్రప‌తిrn ఎన్నిక‌కు చాలా వ్య‌త్యాస‌మున్న విష‌యం మ‌న‌కు తెలిసిందే. అయితే ఆ తేడా rnఏమిటో దాదాపుగా మెజారిటీ మందికి తెలియ‌ద‌నే చెప్పాలి. ఈ క‌థ‌నం చ‌దివితే…rn రాష్ట్రప‌తి ఎన్నిక విధానం పూర్తిగా అర్థం అవుతుంది. దేశంలో రెండు ర‌కాల rnఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. వీటిలో ఒక‌టి ప్ర‌త్య‌క్ష ఎన్నిక కాగా, రెండోది rnప‌రోక్ష ఎన్నిక‌. లోక్ స‌భ స‌భ్యులు, ఎమ్మెల్యేల ఎన్నిక‌లు ప్ర‌త్య‌క్ష rnఎన్నిక‌ల కింద‌కు వ‌స్తాయి. అంటే దేశంలో ఓటు హ‌క్కు ఉన్న ప్ర‌తి ఒక్క‌రు ఈ rnఎన్నిక‌లో పాలుపంచుకుంటారు. ఇక ప‌రోక్ష ఎన్నిక విష‌యానికి వ‌స్తే… rnఎమ్మెల్సీలు, రాజ్య‌స‌భ స‌భ్యులు, రాష్ట్రప‌తి ఎన్నిక‌ల‌న్నీ ప‌రోక్ష rnఎన్నిక‌ల కింద‌కు వ‌స్తాయి. వీటిలోనూ ఎమ్మెల్సీ, రాజ్య‌స‌భ స‌భ్యుల rnఎన్నిక‌లు కాస్తంత స‌ర‌ళంగానే ఉన్నా… రాష్ట్రప‌తి ఎన్నిక మాత్రం rnక్లిష్ట‌మైన‌దే. అస‌లు ఈ ఎన్నిక‌లో ఓట‌ర్లుగా ఎవ‌రుంటారు? ఏ ఏ ఓట‌రుకు ఎంత rnవిలువ ఉంటుంది? అన్న విష‌యాలే ఇక్క‌డ కీల‌కాంశాలుగా ఉంటాయి.

రాష్ట్రప‌తిrn ఎన్నిక‌లో ఓటర్లు ఎంపీలు, ఎమ్మెల్యేలు మాత్ర‌మే. అన్ని రాష్ట్రాల rnఅసెంబ్లీల‌కు చెందిన ఎమ్మెల్యేలంద‌రికీ ఈ ఎన్నిక‌లో ఓటు హ‌క్కు ఉంటుంది. ఇకrn ఎంపీల విష‌యానికి వ‌స్తే… లోక్ ష‌భ స‌భ్యులంద‌రికీ ఓటు ఉండ‌గా, rnరాజ్య‌స‌భ‌లో నామినేటెడ్ స‌భ్యులు మిన‌హా రాజ్య‌స‌భ‌లోని స‌భ్యుల‌కు కూడా rnఓటు హ‌క్కు ఉంటుంది. ఇలా మొత్తంగా ఎంత‌మంది ఓట‌ర్లు ఉంటారంటే… అన్ని rnరాష్ట్రాల అసెంబ్లీల్లోని ఎమ్మెల్యేల సంఖ్య 4,120, నామినేటెడ్ ఎంపీలు rnమిన‌హా మిగిలిన వారి సంఖ్య 776. మొత్తం క‌లిపితే… రాష్ట్రప‌తి ఎన్నిక rnపోలింగ్‌లో పాలుపంచుకునే వారి సంఖ్య  4,986. మ‌రి ఎంపీల ఓటుకు, ఎమ్మెల్యేల rnఓటుకు స‌మాన విలువ ఉంటుందా? అంటే… ఉండ‌దు గాక ఉండ‌దు. ఎందుకంటే ఎమ్మెల్యేrn అసెంబ్లీ నియోజ‌కవ‌ర్గానికి మాత్ర‌మే ప్రాతినిధ్యం వ‌హిస్తారు. అదే ఎంపీ rnఅయితే… అలాంటి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు 5-7 క‌లిస్తే గానీ… ఓ rnపార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గం కాదు క‌దా. అందుక‌నే ఎంపీల ఓటుకు అధిక విలువ rnఉంటుంది. ఎమ్మెల్యే ఓటుకు త‌క్కువ విలువ ఉంటుంది.

స‌రే… మ‌రి rnఅంద‌రు ఎమ్మెల్యేల ఓటుకు స‌మాన విలువ ఉంటుందా? అంటే… కాద‌నే చెప్పాలి. rnపెద్ద నియోజ‌క‌వ‌ర్గాల‌కు చెందిన ఎమ్మెల్యేల ఓటుకు అధిక విలువ ఉంటుంది. అదేrn త‌క్కువ జ‌నాభా క‌లిగిన అసెంబ్లీ నియోజ‌కవ‌ర్గాల‌కు చెందిన ఎమ్మెల్యేల‌కు rnత‌క్కువ ఓటు ఉంటుంది. ఇక ఆయా ఓట్ల విలువ‌ను ప‌రిశీలిస్తే… ఒక్కో ఎంపీ rnఓటుకు 708 పాయింట్ల విలువ ఉంటుంది. దీంతో ఎంపీల ఓట్ల విలువ మొత్తం 5,49,408rn పాయింట్లుగా లెక్క తేలుతుంది. ఇక్క‌డ మ‌రో అంశాన్ని కూడా ప‌రిశీలించాల్సి rnఉంది. అదేంటంటే… దేశంలోని అంద‌రు ఎంపీల‌కు ఈ ఎన్నిక‌లో ఎంత మేర విలువ rnఉంటుందో… దేశంలోని అన్ని రాష్ట్రాల అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు చెందిన rnఎమ్మెల్యేలంద‌రి ఓట్ల విలువ కూడా దాదాపుగా అంతే ఉంటుంది. ఎందుకంటే… rnదేశంలోని ప్ర‌జ‌లంద‌రికీ ఎంపీలు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న‌ట్లే… అంద‌రు rnఎమ్మెల్యేల‌ను క‌లుపుకుంటే వారు కూడా దేశంలోని ప్ర‌జ‌లంద‌రికీ ప్రాతినిధ్యంrn వ‌హించిన‌ట్ల‌వుతుంది. ఇందుకే ఎంపీలంద‌రి ఓట్ల విలువ‌కు దాదాపుగా స‌మానంగాrn ఎమ్మెల్యేలంద‌రి ఓట్ల విలువ స‌మానంగా ఉంటుంద‌న్న మాట‌.

ఎంపీల ఓట్లrn విలువ 5,49,408గా చెప్పుకున్నాం క‌దా… అలాగే ఎమ్మెల్యేల ఓట్ల విలువ rn5,49,495గా ఉంటుంది. ఇక ఎమ్మెల్యేల ఓట్ల విలువ ఒక రాష్ట్ర ఎమ్మెల్యేకు మ‌రోrn రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యేకు మారుతుంటుంద‌ని చెప్పుకున్నాం క‌దా. ఆ rnలెక్కేంటో ఓసారి చూస్తే… ఎక్కువ మంది ప్ర‌జ‌ల‌కు ప్రాతినిధ్యం వ‌హించే rnఎమ్మెల్యేకు ఎక్కువ విలువ‌, త‌క్కువ మంది ప్ర‌జ‌ల‌కు ప్రాతినిధ్యం వ‌హించే rnఎమ్మెల్యేకు త‌క్కువ విలువ అన్న‌మాట‌. అంటే ఉత్త‌ర‌ప్ర‌దేశ్, ప‌శ్చిమ rnబెంగాల్ వంటి రాష్ట్రాల‌ల్లోని ఎమ్మెల్యేకు అత్య‌ధిక విలువ, సిక్కిం, rnఢిల్లీల్లోని ఎమ్మెల్యేకు అతి త‌క్కువ విలువ అన్న‌మాట‌. అంటే పెద్ద rnనియోజ‌క‌వ‌ర్గానికి చెందిన ప‌శ్చిమ బెంగాల్ సీఎం, ఆ రాష్ట్రంలోని rnఎమ్మెల్యేగా మ‌మ‌తా బెన‌ర్జీ ఓటు విలువ 151 పాయింట్లు. అదే ఢిల్లీ సీఎం, ఆ rnరాష్ట్ర ఎమ్మెల్యేగా అర‌వింద్ కేజ్రీవాల్ ఓటు విలువ పాయింట్లు మాత్ర‌మే. ఏ rnరాష్ట్ర ఎమ్మెల్యేకు ఎంత విలువ ఉంద‌న్న విష‌యాన్ని తేల్చేందుకు ఓ చిన్న rnసూత్రం కూడా ఉంది. అదేంటంటే… రాష్ట్ర జ‌నాభాను ఆ రాష్ట్ర ఎమ్మెల్యేల rnసంఖ్య‌తో భాగించి వ‌చ్చే ఫ‌లితాన్ని వెయ్యితో గుణించాలి.  మ‌మ‌తా బెన‌ర్జీ rnఓటు విలువ‌నే తీసుకుంటే… ప‌శ్చిమ బెంగాల్ జ‌నాభాను ఆ రాష్ట్ర మొత్తం rnఎమ్మెల్యేల సంఖ్య‌తో భాగించి, వ‌చ్చే ఫ‌లితాన్ని వెయ్యితో హెచ్చిస్తే rnవ‌చ్చే విలువే దీదీ ఓటు విలువ‌న్న మాట‌.

ఇక ప్ర‌స్తుత ఎన్నికలో rnవిజ‌యం ఎవ‌రిని వ‌రించ‌నుంద‌న్న విష‌యాన్ని ఆలోచిస్తే… ఎన్డీఏకు ఉన్న rnఎంపీలు, ఎమ్మెల్యేలంతా క‌లిపితే మొత్తం ఓట్ల విలువ 47.77 శాతం ఉండ‌గా, rnవిప‌క్షాల కూట‌మి యూపీఏ ఎంపీలు, ఎమ్మెల్యేలంతా క‌లిపితే 35 శాతంగా ఉంది. rnమిగిలిన 17 శాతం విలువ‌ చిన్నా చిత‌క పార్టీల‌ద‌న్న మాట‌. అంటే ఈ ఎన్నిక‌లోrn రామ్‌నాథ్ కోవింద్ విజ‌యం సాధించాలంటే 50 శాతానికి పైగా ఓట్లు సాధించాలి. rnప్ర‌స్తుతం ఎన్డీఏ బ‌లం 48 శాతంగా అనుకున్నా.. ఇంకో 2 శాతం ఓట్లు ఆయ‌న‌కు rnఅవ‌స‌ర‌మ‌న్న మాట‌. విప‌క్ష కూట‌మి యూపీఏ కాకుండా మిగిలిన పార్టీల‌కు 17 rnశాతం మేర ఓట్లు ఉన్న నేప‌థ్యంలో అందులో 2 శాతం ఓట్ల‌ను ఎన్డీఏ అభ్య‌ర్థి rnకోవింద్ రాబ‌ట్టుకోవ‌డం పెద్ద క‌ష్ట‌మేమీ కాదు అన్న వాద‌న వినిపిస్తోంది. rnరాష్ట్రప‌తి ఎన్నిక‌లో మ‌రో కీల‌కాంశం ఉంది. అదేంటంటే… ఎమ్మెల్సీ rnఎన్నిక‌ల్లోలాగా ఇక్క‌డ ఓట‌ర్ల‌కు విప్ జారీ కుద‌ర‌దు. అంటే ఏదేనీ పార్టీకిrn చెందిన ఎంపీ గానీ, ఎమ్మెల్యే గానీ… త‌న పార్టీ సూచించిన అభ్య‌ర్థికి rnకాకుండా త‌న‌కు ఇష్ట‌మైన అభ్య‌ర్థికి ఓటు వేసే వెసులుబాటు ఉంది.