మంత్రిగా మూడేళ్ళ కాలం పని చేసి, తన శాఖకు కొడాలి నాని తెచ్చిన పేరు ప్రఖ్యాుతులేంటి.? అంటే, వైసీపీ నేతలే ఒక్క మాట కూడా చెప్పలేరు. అదీ గడచిన మూడేళ్ళలో కొడాలి నాని మంత్రిగా సాధించిన ఘనత. అయితే, ‘బూతుల మంత్రి’ అని మాత్రం ఆయన ప్రత్యేకమైన గుర్తింపు తెaచ్చుకున్నారండోయ్.!
ఔను, కేవలం చంద్రబాబునీ ఆయన తనయుడ్నీ.. పనిలో పనిగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్నీ తూలనాడేందుకే ఆయనకు పదవి ఇచ్చినట్లుగా వ్యవహరించారు. ఇంతా చేసి, మూడేళ్ళ తర్వాత ఆయన పదవిని కొనసాగించుకోగలిగారా.? అంటే అదీ లేదాయె.
బొత్స సత్యనారాయణకు కొనసాగింపు ఇచ్చారు.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికీ కొనసాగింపునిచ్చారు.. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికీ పొడిగింపు జరిగింది. ఫాఫం.. కొడాలి నానికి మాత్రం పదవి ‘కత్తిరింపు’ తప్పలేదు. ‘నన్ను పీకేసినా ఫర్లేదు..’ అని చెప్పుకోక, వైసీపీకి ఎదురు తిరిగేంత సాహసం ఆయన చేయగలరా.?
సరే, ఆ విషయం పక్కన పెడదాం. ‘మాజీ’ అయ్యారు గనుక, ‘మాజీ మంత్రి’ అని ఆయన్ని సంబోదిస్తారు. చంద్రబాబుని మాజీ ముఖ్యమంత్రి అంటారు.. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని దివంగత మాజీ ముఖ్యమంత్రి అంటారు. ఇందులో తప్పేముంది.?
కొడాలి నాని మాత్రం తనను ‘మాజీ మంత్రి’ అనొద్దని తెగేసి చెబుతున్నారు. అంతలా ‘మాజీ మంత్రి’ అంటే మంటెక్కిపోతోందాయనకి. మాజీ మంత్రి.. అంటే, ‘బూతుల మంత్రి’ అని ఆయనకు వినిపిస్తోందేమో.? లేదంటే, పదవి పోయిన బాధ ఆయన్ని వెంటాడుతుందేమో.!
అన్నట్టు, ‘పదవి నాకు వెంట్రుకతో సమానం..’ అనేశారాయన. మంత్రి పదవి అంటే బాధ్యత.. ఆ పదవిని ఆయన వెంట్రుకలా భావించబట్టే (బాధ్యతల్ని విస్మరించబట్టే), ఇప్పుడు మాజీ అయ్యారు. అద్గదీ అసలు సంగతి.