బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘కోయిలమ్మ’ సీరియల్ 728 ఎపిసోడ్లను పూర్తి చేసుకుని.. 729 ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది. ఈ ఎపిసోడ్ హైలైట్స్ మీకోసం. తెలుగు ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటూ.. సరికొత్త రాగాలను పలిగిస్తున్న కోయిలమ్మ కథ ఏం జరిగిందో చూద్దాం!
గత ఎపిసోడ్లో ఏం జరిగిందంటే…
సమీర్.. తన తండ్రి గురించి, చిన్నీ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో సింధూ రావడంతో.. ‘వదిన(చిన్నీ)ని కాపాడాలంటే ఒకే మార్గం.. కోర్టులో లాయర్ శివానంద్ చిన్నీ ఏ తప్పు చేయలేనదని నిరూపించాలి. లేదంటే.. డాడీకి త్వరగా గతం గుర్తు రావాలి’ అంటాడు. సింధూ షాక్ అవుతుంది. మళ్లీ సమీరే మాట్లాడుతూ.. ‘సింధూ ప్లీజ్ నువ్వు మీ డాడీతో మాట్లాడి… మా డాడీకి మ్యూజిక్ థెరపీ ఇప్పించు’ అని కోరతాడు. దాంతో సింధూ షాక్ అవుతుంది. రమేష్ చంద్రని పైకి పంపించాలని ప్రయత్నిస్తుంటే.. మ్యూజిక్ థెరపీ మనోజ్ కుమార్‌తో ఇప్పించమనడాన్ని తట్టుకోలేక.. ‘మా డాడీకి మీ డాడీకి పాత గొడవలు ఉన్నాయిగా ఏ ముఖం పెట్టుకుని అడగాలి’ అంటూ రివర్స్ అవుతుంది. అదంతా విన్న అమర్ మనసులో.. ‘మనోజ్ కుమార్ గారి కాళ్లు పట్టుకునైనా మా డాడీకి మ్యూజిక్ థెరపీ ఇప్పించాలి’ అని నిర్ణయించుకుంటాడు.
729 ఎపిసోడ్ హైలెట్స్..
చిన్నీ ఉన్న బస్తీలో ఓ భర్త, భార్యను కొడుతూ ఉంటాడు. ధన, చిన్నీ ఇద్దరూ కలిసి వెళ్లి ఆ గొడవను ఆపుతారు. ఏం జరిగిందని ఆమె భర్తను నిలదీస్తుంది చిన్నీ. ‘ఇది నన్ను మోసం చేస్తుంది. నేను లేని సమయంలో ఎవరెవరో వస్తున్నారు దీని దగ్గరకు. మా నాన్న కాకుండా ఇంకెవరు వచ్చారో చెప్పవే.. ఆ బీడీ కట్ట ఎట్లా వచ్చిందో చెప్పవే?’ అంటూ కొడతాడు భర్త ఆమెను. ఇంతలో ఆమె మామగారు బీడీ కట్ట కాల్చుకుంటూ రావడం చూసి.. ‘నాయనా నువ్వు ఎప్పుడు బీడీ కాల్చడం మొదలుపెట్టావ్?’ అంటాడు ఆశ్చర్యంగా ఆ వ్యక్తి. ‘తన అనుమానం నిజంకాదని తెలియడంతో భర్త భార్యకు సారీ కూడా చెబుతాడు. అయితే చిన్నీ ఊరుకోదు. మా మనిషిని బాగా తిడుతుంది. ‘అనుమానించడం, తర్వాత సారీ చెప్పడం.. భర్య కదా ఏదైనా పడుతుందిలే అనుకోవడం.. ఇందా సరికాదంటూ తిట్టి వెళ్లిపోతుంది.
ఇంటికి వెళ్లి బాగా ఆలోచిస్తూ ఉంటుంది. ధనా చిన్నీని కూల్ చేస్తాడు. ‘వదిలెయ్ బుజ్జమ్మా ఈ బస్తీలో జనాలు అంతే’ అని చెబుతుంటాడు. అయితే చిన్నీ మాత్రం ఊరుకోదు. ‘ఈ మనుషులని నేను మారుస్తాను’ అంటుంది నమ్మకంగా. దాంతో చిన్నీ మేనత్త(దుర్గమ్మ) ‘దీనిలో ఎక్కువగా చిన్నీ లక్షణాలే కనిపిస్తున్నాయి’ అని మనసులో అనుకుంటూ.. ‘నీకు పట్టుదల ఎక్కువే. ఇంతకీ నీకు ఎవరి పోలిక..? అమ్మ పోలికా? నాన్న పోలికా?’ అని అడుగుతుంది. వెంటనే చిన్నీ.. ‘అత్తయ్య పోలిక(నీ పోలికే)’ అని చెప్పి లోపలికి వెళ్లిపోతుంది.
ఇంద్రజా లాయర్ శివానంద్‌ని కలుస్తుంది. ఆ సమయంలో చిన్నీ టీ తీసుకుని రావడానికి లోపలికి వెళ్తుంది. చిన్నీ దరపు కేసు వాదించొద్దని, సమీర్ అమాయకుడని, కోకిల(చిన్నీ) కిలాడీ.. అని ఏదేదో చెప్పి కేసు వాదించకుండా చేసే ప్రయత్నం చేస్తుంది. కానీ శివానంద్ ఎంతకీ తగ్గకపోయేసరికి.. అక్కడ నుంచి వెళ్లిపోతుంది. వెళ్లే దారిలో అనుకోకుండా ఇంద్రజ వాళ్ల కారు.. దుర్గమ్మని గుద్దుతుంది. కింద పడిన దుర్గమ్మ కారుని చూసి.. డబ్బులు పట్టాలనే ఉద్దేశంతో బాగా పెద్దగా ఏడుస్తుంది. కిందకు దిగిన ఇంద్రజ దుర్గమ్మని చూసి షాక్ అవుతుంది.
ఒకరికొకరు ‘నువ్వు ఇంద్రజా.. అంటే నువ్వు దుర్గమ్మ’ అని గుర్తుపట్టిన తర్వాత.. దుర్గమ్మ విషయాన్ని వదిలిపెట్టకుండా గొడవ పెద్దది చేసి.. కారుతో గుద్దినందుకు 10 వేలు లాక్కుంటుంది ఇంద్రజ దగ్గర. అక్కడ నుంచి ఆవేశంగా బయలుదేరిన ఇంద్రజకు.. ‘ఆ చిన్నీ గానీ.. ఈ దుర్గమ్మ దగ్గర చేరిందా?’ అనే అనుమానం వస్తుంది. ఇంద్రజ అనుమానం వస్తే.. ఊరికే వదిలేయదు. తెలుసుకునే దాకా వదిలిపెట్టదు. పైగా ఆ దుర్గమ్మ డబ్బుకోసం ఎంత పనైనా చేయడానికి సిద్ధమంటుంది. ఈ తరుణంలో దుర్గమ్మకు తన ఇంట్లో ఉన్న బుజ్జమ్మ చిన్నీనే అని తెలిస్తే… ఇంద్రజకు కచ్చితంగా సాయం చేస్తుంది.
అమర్ మనోజ్ కుమార్ ఇంటికి బయలుదేరతాడు. రమేష్ చంద్రకు మ్యూజిక్ థెరపీ ఇప్పించేందుకు మనోజ్ కుమార్ అయితే బెటర్ అని భావించిన అమర్.. అతడితో మాట్లాడటానికి బయలుదేరతాడు. అయితే విషయం తెలుసుకున్న మనోరమా.. అమర్‌ని ఏదోరకంగా ఆపాలని ప్రయత్నిస్తుంది. అయితే అమర్ మాత్రం కాళ్లు పట్టుకుని అయినా మనోజ్ కుమార్‌ని ఒప్పిస్తానని, తండ్రి రమేష్ చంద్రకు మ్యూజిక్ థెరపీ ఇప్పిస్తానని చెబుతాడు. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం! కోయిలమ్మ కొనసాగుతుంది.