ట్విట్టర్లో మంత్రి కేటీఆర్ కు వినతుల వెల్లువ..!

ట్విట్టర్ ద్వారా ఎవరైనా సాయం కోరిన వెంటనే స్పందించి ఆదుకునే మంత్రి కేటీఆర్ కరోనా సమయంలో మరింతగా స్పందిస్తున్నారు. స్వయంగా కేటీఆర్ కూడా వైరస్ బారిన పడినా ట్విట్టర్లో ఆయనకు వస్తున్న వినతులకు స్పందించి సాయం చేస్తున్నారు. ఆసుపత్రుల్లో బెడ్లు, రెమిడిసివర్ ఇంజెక్షన్లు, ఆక్సిజన్ సిలిండర్, ప్లాస్మా కోసం వినతులు, చివరికి కోవిడ్ నిర్ధారణ పరీక్ష ఫలితాలు ఎక్కువగా చేయడంలేదని, సకాలంలో రిపోర్టులు ఇవ్వడంలేదనే ఫిర్యాదులు కూడా వస్తున్నాయి.

అన్నింటకీ మంత్రి సానుకూలంగా స్పందిస్తున్నారు. తన కార్యాలయం సమస్యలు పరిష్కరిస్తుందని సమాధానం ఇస్తున్నారు. సమస్యలు ఉన్నవారి చిరునామాలు స్వీకరిస్తున్నారు. అభ్యర్ధలను నోట్ చేసుకున్నాం.. కాంటాక్ట్ డిటెయిల్స్ ఇవ్వాల్సిందిగా రిప్లైలు కూడా వస్తున్నాయి. దీంతో బాధితులకు మంత్రి కేటీఆర్ ద్వారా ప్రభుత్వం నుంచి సాయం అందుతోంది. దీంతో కేటీఆర్ స్వయంగా వినతులను పర్యవేక్షిస్తూ తన ఉదారతను మరోసారి చాటుకుంటున్నారని ప్రశంసలు వస్తున్నాయి.