తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న రేవంత్ రెడ్డి ఆ సమయంలో సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఆ సమయంలోనే రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై ప్రశంసల జల్లు కురిపించారు. వ్యక్తిగత భజన అస్సలు వద్దని.. జై సోనియా నినాదం మాత్రమే వినిపించాలని కార్యకర్తలను ఆదేశించాడు. అదే సమయంలో తెలంగాణ తల్లి సోనియా గాంధీ అంటూ వ్యాఖ్యలు చేశాడు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో విమర్శలు గుప్పించాడు.
కేటీఆర్ మాట్లాడుతూ.. ఒకప్పుడు సోనియా గాంధీని బలి దేవత అంటూ మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇప్పుడు తెలంగాణ తల్లి అంటూ మాట్లాడటం సోచనీయం. ఆయన ముందు ముందు చంద్రబాబును తెలంగాణ తండ్రి అంటూ సంభోదిస్తాడేమో అంటూ అసంతృప్తి వ్యక్తం చేశాడు. రేవంత్ రెడ్డిలో ఇంకా తెలుగు దేశం పార్టీ తాలూకు వాసన పోలేదు అంటూ కేటీఆర్ ఎద్దేవ చేశాడు. కాంగ్రెస్ పార్టీ మరియు బీజీపీలు చేయబోతున్న పాదయాత్రలతో ప్రజల అభివృద్ది చూస్తారు తప్ప మరేం లేదు అంటూ కేటీఆర్ అన్నాడు.