లావణ్య రూపంలో ఆ మార్పులేలా?

లావణ్య త్రిపాఠి కెరీర్ ప్రారంభించి దశాబ్ధం దాటినా లుక్ పరంగా ఒకే రకమైన రూపాన్ని కల్గి ఉంది. రూప లావణ్యంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. జీరో సైజ్ లుక్ ని మెయింటెన్ చేయడంలో లావణ్య ప్రత్యేకత వేరు. లావణ్య తర్వాత వచ్చిన చాలా మంది హీరోయిన్ల రూపాల్లో మార్పులొచ్చాయి గానీ..లావణ్య మాత్రం ఒకే టోన్డ్ బాడీని ఇన్నాళ్ల పాటు మెయింటెన్ చేయగల్గింది.

నిత్యం జిమ్..యెగా లాంటి వర్కౌట్ సెషన్ లతో పాటు డైట్ ఫాలో అవ్వడం వంటివి తూచ తప్పకుండా పాటించడంతోనే ఇదంతా సాధ్యమైంది. తాజాగా లావణ్య ఫోటో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది.

అందులో లావణ్య రూపంలో కొద్ది పాటి మార్పులు కనిపిస్తున్నాయి. బ్యూటీ కాస్త బొద్దు ఎక్కినట్లే కనిపిస్తోంది. శరీరంలో అవసరాన్ని మించి కేలరీలు అధిక మొతాదులో కనిపిస్తున్నాయి. బ్లూ కలర్ డెనిమ్ జీన్స్ ధరించి..టాప్ లో వైట్ బనియన్ తో బ్యూటీ కెమెరాకి ఫోజులిచ్చింది. బీచ్ సైడున రిసార్స్ట్ లో ఇలా నవ్వుతూ కనిపించింది.

లావణ్య ముఖంలోనూ చాలా మార్పులను గమనించవచ్చు. మరి ఈ లుక్ చేంజ్ సినిమా కోసమా? లేక ! డాక్టర్ల సూచనల మేరకు శరీరానికి అవసరమైన కొవ్వు సైతం నిలువ చేయాలని బ్యూటీకి సూచించారా? అన్నది తెలియాల్సి ఉంది. సైజ్ జీరో లుక్ లో ఫోజులిచ్చే బ్యూటీ ఇప్పుడిలా బొద్దెక్కిన అందంతో కనిపించడం ఆసక్తికరంగా మారింది.

ఇక లావణ్య త్రిపాఠి సినిమాల విషయానికొస్తే కెరీర పరంగా లావణ్య కి పెద్దగా గ్యాప్ లు లేవు. కెరీర్ ప్రారంభించి దాశాబ్ధం దాటింది. ఏడాదికి ఒక సినిమా చొప్పున ప్రేక్షకుల ముందుకు వస్తూనే ఉంది. గతే ఏడాది `ఏ1 ఎక్స్ ప్రెస్`..`చావు కబురు చల్లగా` లాంటి సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించింది.

యంగ్ హీరోలకు పర్పెక్ట్ జోడీగా మ్యాచ్ అవుతుంది. కానీ సక్సెస్ ల పరంగా బాగా వెనుకబడే ఉంది. వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంది గానీ..స్టార్ హీరోయిన్ల భామల రేసులో ఏనాడు నిలువలేదు. యంగ్ హీరోల ఆప్షన్ గానే ముందుకు వెళ్తోంది. ప్రస్తుతం `హ్యాపీ బర్త్ డే` అనే ఓ సినిమాలో నటిస్తోంది. ఆ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

లావణ్య వెనుకబాటుకు ఓ కారణం కూడా తరుచూ వినిపిస్తుంటుంది. గ్లామర్ ఎలివేషన్స్ కి ఎప్పుడూ దూరమే. అందాల వడ్డన పైపైనే. ఆ మధ్య ఓ యంగ్ హీరో సినిమాలో బికినీ ధరించింది. కొన్ని లిప్ లాక్ సన్నివేశాల్లోనూ నటించింది. తర్వాత మళ్లీ అలాంటి ప్రయోగాలకు పోలేదు. ఫోటో షూట్లలలో టెంప్టింగ్ ఎలివేషన్స్ కి తొలి నుంచి దూరంగా ఉంటుంది. ఇప్పటికీ అలాగే కంటున్యూ అవుతోంది. ఆ రకంగానూ లావణ్య పెద్దగా ఫోకస్ కాలేకపోయింది