సినీ నటి మాధవీలత, భారతీయ జనతా పార్టీలో చేరి, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్నికల్లో పోటీ చేసిన విషయం విదితమే. రాజకీయాలపైనా, సినీ పరిశ్రమపైనా అడపా దడపా సంచలన వ్యాఖ్యలు చేస్తుంటుంది మాధవీలత. తాజాగా, మాధవీలత ‘డ్రగ్స్’ అంశంపై సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఇప్పుడు టాలీవుడ్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది.
కొన్నాళ్ళ క్రితం తెలుగు సినీ పరిశ్రమలో ‘డ్రగ్స్’ కలకలం రేగిన విషయం విదితమే. ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి, ఆ కేసుని డీల్ చేశారు. ఈ క్రమంలో పలువురు సినీ ప్రముఖులు విచారణకు హాజరు కావడం.. అప్పట్లో కొందరు సినీ ప్రముఖుల అరెస్ట్ తప్పదన్న ప్రచారం జరగడం తెల్సిన విషయాలే. అయితే, అనూహ్యంగా ఆ కేసు అలా అలా డైల్యూట్ అయిపోయింది. తెరవెనుక కొందరు పెద్దలు ఈ వ్యవహారం సైలెంటవడంలో కీలక పాత్ర పోషించారనే చర్చ ఇప్పటికీ టాలీవుడ్లో జరుగుతూనే వుంది.
ఇక, ఇప్పుడు బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుట్ మిస్టరీ డెత్‌కి సంబంధించి సీబీఐ విచారణ జరుపుతుండగా, డ్రగ్స్ అంశం కూడా తెరపైకొచ్చింది. హీరోయిన్ రియా చక్రవర్తి చుట్టూ డ్రగ్స్ ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ మాధవీలత తన ఫేస్బుక్ పోస్ట్‌లో, టాలీవుడ్‌కి సంబంధించి గతంలో వచ్చిన డ్రగ్స్ ఆరోపణల విషయాన్ని పేర్కొనడం గమనార్హం.
‘కాస్త టాలీవుడ్‌పైనా ఫోకస్ పెట్టండి.. సీరియస్‌గానే ఈ కేసుని డీల్ చేయండి.. సిన్సియర్‌గా పనిచేసిన ఓ అధికారిని, ఆ తర్వాత ట్రాఫిక్‌కి పంపించారు..’ అంటూ మాధవీలత వ్యాఖ్యానించడం గమనార్హం. ‘డ్రగ్స్ లేకుండా టాలీవుడ్లో పార్టీలు జరగవు..’ అని మాధవీలత వ్యాఖ్యానించడంపై సోషల్ మీడియా వేదికగా కుప్పలు తెప్పలుగా కామెంట్స్ వచ్చిపడుతున్నాయి.
ఫలానా హీర డ్రగ్స్ అడిక్ట్.. అంటే, ఫలానా హీరోయిన్ డ్రగ్స్ క్యారియర్.. అంటూ కొందరు హేటర్స్ కామెంట్స్‌తో విరుచుకుపడుతున్నారు. ఏదిఏమైనా, గతంలో టాలీవుడ్ చుట్టూ విన్పించిన డ్రగ్స్ ఆరోపణలు, ఆ తర్వాత సైలెంటయిపోవడం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. మాధవీలత కామెంట్స్‌తో మళ్ళీ ఆనాటి కేసులో కదలిక వస్తుందా.? వేచి చూడాల్సిందే.
NCBసుశాంత్ కేసు లో అడుగు పెట్టడం మంచిదే బాలీవుడ్ లో డ్రగ్స్ వాడకం బాగా ఉంది అన్నది నిజం కానీ ఇదిగో అదిగో అని ఫైనల్ గ…
Posted by Actress Maadhavi on Sunday, August 30, 2020